YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తెలంగాణలో ఎన్నికలఫై ఇంకా నిర్ణయం తీసుకోలేదు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ ఓపీ రావత్‌

తెలంగాణలో ఎన్నికలఫై ఇంకా నిర్ణయం తీసుకోలేదు          కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ ఓపీ రావత్‌
నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలో, లేదో అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ ఓపీ రావత్‌ స్పష్టం చేసారు. జమిలి ఎన్నికలైతే పార్లమెంట్‌తో పాటే తెలంగాణ అసెంబ్లీకి జరిగేవని, ఏప్రిల్‌ 2019లో అవి జరగాల్సి ఉందన్నారు. కానీ ఇప్పుడు ఆ వాదనకు అవకాశం లేదని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణలో కూడా ఎన్నికలు నిర్వహించాలంటే అందుకు తగిన ఏర్పాట్లను సమీక్షించాల్సి ఉంటుందన్నారు. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు.  చట్టంలో ఈ విషయంపై ప్రత్యేకంగా ఎలాంటి నిబంధనా లేదని, దీనిపై 2002లో రాష్ట్రపతి సుప్రీం కోర్టు అభిప్రాయం కోరగా.. అసెంబ్లీ రద్దయినప్పుడు ఎన్నికలు త్వరగా జరపాలని అత్యున్నత న్యాయస్థానం సూచించిందన్నారు. ఎందుకంటే ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఆయాచిత ప్రయోజనంపొందేలా ఆరు నెలల పాటు అధికారంలో ఉండకూడదని సూచించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటామని రావత్‌ స్పష్టంచేశారు. నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని ఎవరో చెప్పిన జోష్యంతో ఈసీకి సంబంధంలేదన్నారు.

Related Posts