డిసెంబర్ నెలకు సంబంధించిన 61,540 ఆర్జిత సేవా టిక్కెట్లను ఆన్ లైన్ లో ఉంచామని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. డయిల్ యువర్ ఈవో కార్యక్రమంలో భాగంగా పలు అర్జీలను స్వీకరించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ లక్కీ డిప్ కేటగిరీలో సుప్రభాత సేవ 3595, తోమాల 50, అర్చన 50, అష్టదళ పాదపద్మారాధన 120, నిజాపాదదర్శనం 2300 టిక్కెట్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. జనరల్ కేటగిరీ లో విశేషపూజ 1500, కల్యాణోత్సవం 12825, ఉంజాల్ సేవ 4050, ఆర్జిత బ్రహ్మోత్సవం 7150, వసంతోత్సవం 14300 సహస్ర దీప అలంకరణ సేవ 15600 లా టిక్కెట్లను ఆన్ లైన్ లో ఉంచినట్లు ఆయన అన్నారు. 21 మంది భక్తులు అడిగిన ప్రశ్నలకు జవాబులు తెలిపామని, వారు ఇచ్చిన కంప్లైంట్ పైన కూడా చర్యలు తీసుకుంటామని ఈఓ అన్నారు. గత సంవత్సరం ఆగస్టు నెలలో 22 లక్షల 69 వేల మంది భక్తులు దర్శించుకున్నారని, ఈ సంవత్సరం ఆగస్టు నెలలో 19లక్షల 20 వేల మంది దర్శించుకున్నారని ఈఓ అన్నారు. భక్తులు బ్రహ్మోత్సవాల్లో అతిముఖ్యమైన గరుడసేవ రోజు ప్రత్యేక ఏర్పాట్లను చేసినట్లు అయన అన్నారు.