YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

క్షీణిస్తున్న రూపాయి విలువ.. పెరుగుతున్నఅప్పుల భారం

క్షీణిస్తున్న రూపాయి విలువ.. పెరుగుతున్నఅప్పుల భారం

అందులో మొదటిది పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధర ,క్షీణిస్తున్న రూపాయి విలువ తో ప్రస్తుతం దేశం సమస్యలను ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా మన కరెన్సీ రోజురోజుకూ పతనమవుతుండటం దేశ అప్పుల భారాన్ని భారీగా పెంచుతున్నది. ఈ ఏడాది డాలర్‌తో పోలిస్తే రూపాయి 11శాతం క్షీణించింది. దీనివల్ల దేశంపై ఇప్పటికిప్పుడు రూ.68500 కోట్ల అదనపు భారం పడనుంది. స్వల్పికాలిక రుణాలను చెల్లించే క్రమంలో రానున్న నెలల్లో ఇంత భారీ మొత్తాన్ని దేశం అదనంగా భరించాల్సి ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. గురువారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 72కు పడిపోయింది. దీనివల్ల దేశ కరెంటు ఖాతా లోటు మరింత పెరగనుంది.ఈ ఏడాది చివర్లో డాలర్‌తో రూపాయి విలువ 73గా ఉండి.. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 76డాలర్లుగా ఉంటే.. దేశ ముడి చమురు దిగుమతుల మొత్తం రూ.45700 కోట్లకు చేరనుందని స్టేట్ బ్యాంక్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ చెప్పారు. 2017లో డాలర్‌తో రూపాయి మారకపు విలువ (రూ.65.1)తీసుకుంటే.. ఈ ఏడాది స్వల్పకాలిక రుణాల కింద రూ.7.1 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంది. అది ఇప్పటి సగటు మారకపు విలువ రూ.71.4 ప్రకారం తీసుకుంటే.. ఆ మొత్తం రూ.7.8 లక్షల కోట్ల డాలర్లు కానుందని ఘోష్ అంచనా వేశారు. అంటే సుమారు రూ.70వేల కోట్ల అదనపు భారం పడనుంది.

Related Posts