ఇంగ్లాండ్‌పై భారత్ మరోసారి బౌలింగ్ ప్రతాపం చూపించింది. ఈ సిరీస్‌లో స్థిరంగా రాణిస్తున్న పేసర్లు మరోసారి చెలరేగడంతో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసేందుకు బాటలు వేసుకుంది.. ఓపెనర్ అలిస్టర్ కుక్ (190 బంతుల్లో 8 ఫోర్లతో 71), మొయిన్ అలీ (170 బంతుల్లో 4 ఫోర్లతో 50) అర్ధ శతకాలతో రాణించగా శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 90 ఓవర్లలో 7 వికెట్లకు 198 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్ (11 బ్యాటింగ్), రషీద్ (4 బ్యాటింగ్) ఉన్నారు. ఇషాంత్‌కు మూడు, బుమ్రా.. జడేజాలకు రెండేసి వికెట్లు దక్కాయి.