YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆన్‌లైన్‌లో పందెం కోళ్ల అమ్మకాలు..

ఆన్‌లైన్‌లో పందెం కోళ్ల అమ్మకాలు..

పందెం కోళ్లు కూడా ఆన్ లైన్‌లో,,

కోళ్లను పెంచే రైతులు  అవలీలగా ఆన్‌లైన్‌..

సంక్రాంతికి కోడి పందేలుంటేనే అసలు మజా. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో పందేల సందడి మొదలైపోయింది. తమ కోడి గెలుపును ప్రతిష్టగా భావించే పందెం రాయుళ్లు చాలా మందే ఉంటారు. అందుకే నెలల ముందు నుంచి కోళ్లను పెంచుతుంటారు. ఓ రేంజ్‌లో ట్రైనింగ్ ఇచ్చి పోటీలకు సిద్ధం చేస్తుంటారు. అప్పటికప్పుడు కోళ్లను కొనాలనుకునేవారు.. పేరు పొందే ప్రాంతాలకు వెళ్లి.. పందెం కోళ్లను కొనుగోలు చేస్తుంటారు. ఐతే ఇప్పుడు అలాంటి వాళ్లకు ఈజీ అయ్యేలా రైతులు కొత్త పద్దతి ఫాలో అవుతున్నారు. కోళ్లను పెంచే రైతులు ఆన్‌లైన్‌ను అవలీలగా వాడేస్తున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో వ్యాపారం మొదలెట్టేశారు. ఫేస్ బుక్, ఓఎల్ఎక్స్, ట్విట్టర్‌లో కోళ్లను ప్రదర్శించి అమ్మకానికి ఉంచుతున్నారు. కోడి జాతి ఏంటి.. దాని వివరాలు ఏంటన్న విషయాలతో పాటు.. కోళ్ల వీడియోలు కూడా పెట్టి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు.

ఆర్డర్ చేస్తే చాలు ఇంటికి నేరుగా తీసుకొస్తున్నారు. సంక్రాంతికి నెలల ముందు నుంచే కోళ్లను పెంచుతుంటారు రైతులు. హై క్లాస్ సదుపాయాలు కల్పిస్తూ.. వ్యాయామాలు కూడా చేయిస్తుంటారు. ఐతే కోళ్ల మీద ప్రేమతోనే వాటిని పెంచుతామని.. పందాల గురించి తెలియదని ఎలాంటి సంబంధం లేదని రైతులు అంటున్నారు. ఎక్కడికో వెళ్లి కొనుక్కునే శ్రమ లేకుండా.. ఇలా ఆన్ లైన్‌లో కూడా పందెం కోళ్ల అమ్మకాలు నిర్వహించడం బాగుందని కొనుగోలుదారులు అంటున్నారు. ఈ కామర్స్ పుణ్యమా అని.. ఇప్పుడు ఇంటి నుంచి బైటికి అడుగు పెట్టకుండానే.. షాపింగ్ చేసుకునే వీలు కలుగుతోంది. బట్టలు, వస్తువులే కాదు... ఇప్పుడు పందెం కోళ్లు కూడా ఆన్ లైన్‌లో దొరకుతుండడంపై.. సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి.

Related Posts