రాజ్యసభలో మేడారం జాతర ప్రస్తావన..
గత శుక్రవారం సభకు రాకపోవడానికి తెలంగాణ రాష్ట్రం లోని మేడారం వెళ్లడం కారణంగా రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చెప్పారు కోటిన్నర మంది హాజరైన ఈ గిరిజన జాతర ఓ మినీ కుజిభమేళా అన్నారు. 8 రాష్టాల ఆదివాసీ, గిరిజనులు సొంత ఖర్చులతో జాతరకు రావడం, భక్ష్తి శ్రద్ధలు, క్రమశిక్షణ తో పూజలు చేయడం అద్భుత అనుభూతిని ఇచ్చిందన్నారు. కాగా అంతకు ముందు యు 19 కప్ గెలిచినా యువ భారత్ కు సభ తరపున ఉప రాష్ట్రపతి అభినందనలు తెలిపారు.