YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కృష్ణాలో టీడీపీ అశలు.. నిలిచేనా...

కృష్ణాలో టీడీపీ అశలు.. నిలిచేనా...
ఏపీలో కృష్ణా జిల్లా అంటే టీడీపీకి ఎంత పెట్టని కోటో ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కృష్ణా జిల్లా టీడీపీకి వన్‌ సైడ్‌గా కొమ్ము కాస్తూ వ‌స్తోంది. 1983 త‌ర్వాత జ‌రిగిన ఎన్నో సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ ఆధిప‌త్యం సాధించింది. ఇక్కడ ప్రధానంగా ఉన్న‌ ఓ సామాజికవర్గం ఓట్లు సాలిడ్‌గా టీడీపీకే పడడంతో కృష్ణా జిల్లా అంటేనే పసుపు కోటగా మారిపోయింది. చివరకు 2009లో రాష్ట్రంలో రెండో సారి వైఎస్‌ గాలులు బలంగా వీచినప్పుడు కూడా నాడు ప్రజారాజ్యం ఎంట్రీతో ముక్కోణపు పోటీ జరిగినా కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీదే పై చెయ్యి అయ్యింది.ప్రజారాజ్యం, కాంగ్రెస్‌ పార్టీల కంటే ఈ జిల్లాలో తెలుగుదేశం సంపూర్ణ ఆధిపత్యం కనబరిచి సత్తా చాటింది. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ 8 అసెంబ్లీ, మ‌చిలీప‌ట్నం ఎంపీ సీటు గెలుచుకుంటే కాంగ్రెస్ ఒక ఎంపీ సీటుతో పాటు 6 సీట్ల‌తో స‌రిపెట్టుకుంది. ప్ర‌జ‌రాజ్యం కేవ‌లం 2 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. ప్ర‌జారాజ్యం ఎఫెక్ట్ లేక‌పోతే ఆ ఎన్నిక‌ల్లో టీడీపీకి మ‌రో నాలుగు సీట్లు ద‌క్కేవే. ఇక గత ఎన్నికల్లో అయితే కృష్ణా జిల్లాలో టీడీపీకి అనుకూలంగా వార్‌ వన్‌ సైడే అయ్యింది. జిల్లాల్లో 2 ఎంపీ సీట్లతో పాటు బీజేపీతో కలిపి 11 అసెంబ్లీ సీట్లను కూడా టీడీపీ కైవసం చేసుకుంది. అలాగే టీడీపీ స‌పోర్ట్‌తో కైక‌లూరు సీటు బీజేపీ గెలిచింది. మరి ఇప్పుడు అలాంటి కంచుకోటలాటి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ కోటల‌కు బీట‌లు వారుతున్నాయా ? అంటే అవుననే ఆన్సర్‌ వినిపిస్తోంది.ప్రస్తుతం కృష్ణా జిల్లాల్లో చూస్తే తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలుగా ఉన్న నియోజకవర్గాలు సైతం… చివరికి మంత్రి దేవినేని ఉమా లాంటి వారు ఎమ్మెల్యేలుగా ఉన్న‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో సైతం వైసీపీ దూకుడు ముందు టీడీపీ బేజారు అవుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన నుజివీడు, గుడివాడ, పామర్రు, విజయవాడ వెస్ట్‌ నియోజకవర్గాల్లో ఇప్పటికి వైసీపీ బలంగా ఉంది. నుజివీడులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు మరో సారి విజయం సాధించే దిశలో ఉండగా గుడివాడలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొడాల నానికి బ్రేకులు వేసే టీడీపీ లీడరే కనపడడం లేదు. విజయవాడ వెస్ట్‌ పామర్రులో వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు పార్టీలు మారినా అక్కడ టీడీపీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉంది. మంత్రి దేవినేని ఉమా ప్రాధనిత్యం వహిస్తున్న మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్‌ వైసీపీ నుంచి పోటీకి రెడీ అవుతుండడంతో మంత్రికి చెమటలు పడుతున్నాయి. వసంత దూకుడు ముందు ఉమా బేజారు అవుతున్నారని రాజకీయవర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఇక్క‌డ వ‌సంత పోటీ చేస్తుండ‌డంతో ఇప్పుడు ఉమ నియోజ‌క‌వ‌ర్గ‌మే వ‌ద‌ల‌డం లేదు.ఇక ఎన్టీఆర్‌ పుట్టిన గెడ్డ పామర్రులో వైసీపీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉండడంతో ఇక్కడ ఏమి చెయ్యాలో తెలియక టీడీపీ సతమతమౌతోంది. గత ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్ట బోయి టీడీపీ గెలిచిన జగ్గయ్యపేటలో ఈ సారి వైసీపీ గాలులు బలంగా వీస్తున్నాయి. అలాగే రిజ‌ర్వ్‌డ్‌ నియోజకవర్గాలైన నందిగామ, తిరువూరులోను వైసీపీ సానుకూల పవనాలు కనిపిస్తున్నాయి. నందిగామ‌లో టీడీపీ ఎమ్మెల్యేపై వ్య‌తిరేక‌త వైసీపీకి క‌లిసొస్తోంది. అవనిగడ్డలో మండల బుద్ద ప్రసాద్‌ రేసులో వెనుక పడగా వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నా సింహద్రి రమేష్ అధిపత్యం స్పష్టంగా కనబడుతుంది.విజయవాడ వెస్ట్‌ నియోజకవర్గంలో వైసీపీ నుంచి గెలిచిన జలీల్‌ఖాన్‌ పార్టీ మారినా ఇక్కడ క్షేత్రస్థాయిలో వైసీపీయే బలంగా ఉండడంతో పాటు వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండానే ఎగురుతుందని అన్నది ఓపెన్‌ టాక్‌. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఎమ్మెల్యేగా ఉన్న కైకులూరులో టీడీపీకి బలమైన నాయకత్వంలేకపోవడంతో పాటు గ్రూపు తగాదాలు మైనెస్‌గా మారాయి. జిల్లా కేంద్రం నుంచి ప్రాధినిత్యం వహిస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర తీరుపై తీవ్రమైన వ్యతిరేఖత వ్యక్తం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలిచే పరిస్థితి లేదని టీడీపీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఏదేమైనా టీడీపీకి కంచుకోటలాంటి కృష్ణా జిల్లాల్లో ఎన్నికల వేల ఆ పార్టీ డౌన్‌ అవుతుండగా… వైసీపీకి జోరు అందుకోవడం విశేషం.

Related Posts