బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాత్సశాఖలో అవినీతి జరిగిందని ఆరోపణ చేశారు. ఆయనకు అవాస్తవాలు ప్రచారం చేయటం అలవాటుగా మారిందని ఏపీ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ కుటుంబరావు అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. మత్సశాఖకు బడ్జెట్ 600 కోట్లు. మరి ఎక్కడి నుంచి 6700 కోట్ల అవినీతి జరిగినట్లు. ఆధారాలు ఉంటే సమర్పించంఢి. వారం రోజుల్లో సాక్షాలు చూపించకపోతే నోటీసులు జారీ చేస్తామని అన్నారు. అమరావతి బాండ్ లలో లిస్ట్ చెప్పట్లేదు అంటున్నారు. పబ్లిక్ ఇష్యూ చేసిన బాండ్స్ ఇన్వెస్టర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారా. ఫ్రాంక్లిన్ ఇండియా వంటి పేరున్న ట్రిలియన్ డాలర్ల కంపెనీ అమరావతి ప్రగతిలో ఇన్వెస్ట్ చేస్తే అనుమానాలు రేకిస్తున్నారు. అసత్య ప్రచారాలతో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. అత్యంత పారదర్శకంగా బాండ్ ఇష్యూ జరిగింది. ఉండవల్లి ఆరోపణలు చేస్తున్నట్లు ఇందులో ఇక శాతం అవినీతి జరిగిందని నిరూపిస్తే నేను 24 గంటల్లో రాజీనామా చేస్తాననని అయన అన్నారు. ఆర్ధిక అంశాలపై ప్రజలకు పట్టు ఉండదని.. అవాస్తవాలతో ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో నేనెక్కడా కులం, మతం ప్రస్తావన తేలేదు. కావాలంటే క్లిప్పింగ్ మొత్తం సరి చూసుకోవచ్చు. రాజశేఖర రెడ్డి హయాంలో అవినీతి జరిగిందని ఆయనే చెప్పకనే చెప్పారు. మనీ టేకింగ్ కి, మనీ మేకింగ్ తేడా అంటే ఏంటో ఉండవల్లి ఆరుణ్ కుమార్ చెప్పాలని అయన అన్నారు. ముఖ్యమంత్రి కొడుకు అనే జగన్ కంపెనీ లో పెట్టుబడులు పెట్టారు. క్విట్ ప్రొ కో పద్దతిలో లబ్ది పొందారు. వ్యక్తిగతంగా ఆయనపై నాకు గౌరవం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి అవాస్తవాలు ప్రచారం, వ్యక్తిగత దాడికి దిగి అది పోగొట్టుకోవద్దని ఉండవల్లికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఒక శాతం ఓటు బ్యాంకు లేని బీజేపీ కి ఏపీ లో భవిష్యత్తు శూన్యం. కాబట్టి కన్నా లక్ష్మినారాయణ అసంబద్ధ ప్రేలాపణలు మానుకోవాలని కుటుంబరావు సూచించారు.