పశ్చిమగోదావరి జిల్లా పర్యటన ముగిసిన తరువాత జనసేనాని పవన్ కళ్యాణ్ జనం నుంచి కనుమరుగయ్యారు. జనసేన పార్టీ రోజు రోజుకి అగమ్యగోచరంగాతయారవుతుంది అనటంలో సందేహం లేదు. ఇదిలా ఉంటే బిజెపి, పవన్ కళ్యాణ్, జగన్ ని కలుపుకొని ఆంద్రాలో పట్టు బిగించాలని చూస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో జగన్ మోహన్ రెడ్డి, పవన్ పర్యటన ముగిసిన తరువాత ఉత్తర భారతీయ జనతా పార్టీ జరిపించుకున్న సర్వే ఫలితాలు, మూడు పార్టీలకు నిద్రను దూరం చేశాయి. ఎందుకంటే ఆ సర్వేలో, పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం బలం గట్టిగా ఉందని ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం స్థానాలు యధావిధిగా ఉంటాయని ఎటువంటి మార్పులు చేర్పులు జరగవని ఆ సర్వే స్పష్టం చేసింది.దీనితో కంగుతిన్న బిజెపి అర్జెంటుగా పవన్ ను, జగన్ ని కలిసి కూర్చోబెట్టాలని నిర్ణయించుకుంది. ఆ దిశగా కొందరు కాపు కుల పెద్దలు, రెడ్డి కుల పెద్దలు ను పురమాయించింది. వీరి ఇద్దరి రహస్య భేటీ త్వరలోనే ఎక్కడైనా జరగవచ్చు. ఈ భేటీ ముగిసిన తరువాత అంటే సుమారు నవంబర్ నెలలో మరొక సారి రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించే కార్యక్రమాలు బిజెపి ఆధ్వర్యంలో ఈ రెండు పార్టీలు చేయవచ్చు. గత నాలుగేళ్లలో మనం ఒకసారి పరిశీలిస్తే తెలుగుదేశంతో సఖ్యత గా ఉంటూనే, పొత్తు నడుపుతూనే, రాష్ట్రంలో బలపడాలనే తన కోరికకు అనుగుణంగా బిజెపి చేసిన ప్రయత్నాలను ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. రాజకీయంగా బలపడితే, ఎవరికీ ఎటువంటి సమస్య ఉండేది కాదు. కానీ బిజెపి తన బలపడాలనే కోరికతో రాష్ట్రంలో, కులాలను కదిలించడానికి జగన్ తో కలిసి ముందుకు అడుగులు వేసింది.మొదటి రెండు సంవత్సరాలు కమ్మ కులం మీద, మిగతా కులాల విద్వేష పూరిత వాతావరణం కలిగేలాగా వైసిపి ద్వారా ప్రయత్నం చేసింది. తమకు సహజసిద్ధమైన ఓటు బ్యాంకుగా ఉండే బ్రాహ్మణ, వైశ్య కులాలను తెలుగుదేశం కి వ్యతిరేకంగా మార్చే క్రమం కోసం ఐవైఆర్ కృష్ణారావు ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించింది. రాష్ట్రానికి ప్రధమ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గారిని చంద్రబాబు నియమించారు. ఆయన రిటైర్ అయిన తరువాత కూడా కొత్తగా ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ ఆయనను చైర్మన్ గా నియమించారు. కానీ బిజెపి వైసిపి ఆటలో ఐవైఆర్ కృష్ణరావు పావుగా మారారు. ఎంతో ఉన్నతంగా ప్రజలు భావించే స్థానం నుంచి కృష్ణారావు పడిపోయాడు. ఐవైఆర్ కృష్ణారావు మాటకు విలువ లేదని తెలిసిన క్షణం నుంచి కృష్ణారావు పక్కనపెట్టి, రమణ దీక్షితులుని ముందుకు తీసుకువచ్చింది బిజెపి.శ్రీవారి సేవ, తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన అర్చకులుగా ఎంతో గురుతరమైన బాధ్యతను నిర్వహించిన రమణ దీక్షితులు, ఈ రాజకీయ వైకుంఠపాళిలో తన పదవిని పోగొట్టుకుని, రాష్ట్ర ప్రజల దృష్టిలో దోషిగా నిలబడ్డాడు. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడును హిందూ వ్యతిరేకిగా ముద్ర వేయాలని తీవ్రంగా ప్రయత్నం చేసిన బిజెపి, వైసిపి ఆ దిశగా బ్రాహ్మణ, వైశ్య కులాలను ఉపయోగించుకోవాలి అని నిర్ణయించాయి. కానీ పటిష్టమైన పునాది ఉన్న తెలుగుదేశం పార్టీ, రాజకీయంగా అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఈ కుట్రను ముందుగానే పసి గట్టి, నష్ట నివారణ చర్యలు తీసుకోవటం ద్వారా వారి ప్రయత్నం ఫలించలేదు.ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే, మళ్ళీ మన జనసేన దగ్గరకు వద్దాం. పవన్ జనసేన పార్టీ పెట్టి ప్రభుత్వం మీద దాడి చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల తెలుగుదేశం సాధించిన ఓట్లల్లో కోత పడుతుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎటు తిరిగి జగన్ కి పడుతుంది, తద్వారా తెలుగుదేశం రెండు విధాల నష్టపోయి అధికారంకి దూరమవుతుందని, అప్పుడు తమ కసి తీరుతది అని జగన్, మోడీ షా లు కలగన్నారు. కానీ పవన్ రంగంలోకి వచ్చిన తరువాత చిత్రవిచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. పవన్ ప్రసంగాలు పేలవంగా సాగడం, తన అవగాహనారాహిత్యాన్ని బయట పెట్టుకోవడం మొదలైన సంఘటనలే కాకుండా పవన్ ఎవరు ఓట్లు చీల్చుతున్నాడు అని భారతీయ జనతా పార్టీ ఒక సర్వే నిర్వహించింది.ఆ సర్వే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, పవన్, జగన్మోహన్ రెడ్డి ఓట్లు కొల్లగొడుతున్నారని తేలింది. జగన్ ఓట్ల శాతం 28 పడిపోయింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తన ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుందని సదరు బిజెపి సంస్థ తేల్చి చెప్పింది. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్ట అన్నట్టు తయారయింది మోడీ షా ల పరిస్థితి. ఇక ఇలా కాదులే అనుకోని జగన్ ను, పవన్ ను కలిపితే కానీ, చంద్రబాబుని ఆపలేమని, ఇద్దరి మధ్య సయోధ్య కు ప్రయత్నాలు మొదలెట్టారు ఈ గుజరాతీ గాయకులు. ఈ సయోధ్య అయ్యే దాకా, పవన్ బయటకి రాడు. అందుకే తెలంగాణా ఎన్నికల్లో అన్ని పార్టీలు బిజీగా ఉన్నా, జగన్, పవన్ మాత్రం, తెలంగాణా ఊసే ఎత్తటం లేదు. మొత్తానికి ఒక్క సర్వేతో పవన్, అజ్ఞాతంలోకి వెళ్లి దాదాపు నెల రోజులు అయ్యింది