YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

23 నుంచి ఆయుష్మాన్ భారత్

23 నుంచి ఆయుష్మాన్ భారత్

ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా ప్రకటించిన 'ఆయుష్మాన్ భారత్' కార్యక్రమం సెప్టెంబరు 23న ప్రారంభంకానుంది. ప్రధాని నరేంద్రమోదీ జార్ఖండ్ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కోడర్మాలో మెడికల్ కాలేజీకి, చాయ్ బాసాలో కేన్సర్ ఆస్పత్రికి మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాన్ని జార్ఖండ్ నుంచి ప్రారంభించడం తమకు గర్వకారణమని జార్ఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలోని 3.25 కోట్ల మంది ప్రజలతోపాటు దేశ ప్రజలందరూ.. ఈ చారిత్రక సందర్భం కోసం ఎదురుచూస్తున్నారని చైనా పర్యటనలో ఉన్న జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆయుష్మాన్‌ భారత్‌’ కార్యక్రమంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు కురిపించింది. 10 కోట్ల కుటుంబాలకు ఏడాదికి రూ.5లక్షల ఆరోగ్య బీమా అందించేందుకు ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న చొరవ అద్భుతమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అభినందించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకమని.. ప్రధాని చిత్తశుద్ధికి ఈ పథకం నిదర్శనమని కొనియాడారు. 

Related Posts