"ఎందుకంటే? మనం స్టీరియోటైప్ కాబట్టి?":సినిమా లో కళ తరిగినప్పుడు "కళ" కలయే అవుతుంది.ఈ శుక్రవారం రెండు తెలుగు సినిమాలు చూసాను ఒకటి "టచ్ చేసి చూడు" రెండవది "చలో" ఈ రెండు సినిమా కథ , కథనాలు మేము మా పంథాను మార్చుకోము మేము "streotype " కు నిలువెత్తు సంతకం అని సగౌరవంగా నిరూపించుకున్న సినిమాలు.కౌశలం లేని పని కళ కాదు కౌశలంతో కూడుకున్న పని కళ అవుతుంది.రాజా ది గ్రేట్ సినిమాతో ఘనవిజయం సాధించిన రవితేజ హీరోగా వచ్చిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ టచ్ చేసి చూడు. రవితేజ మాస్ మహారాజ అందులో సందేహం లేదు, అయనకు సినిమా పైన ఉన్న మక్కువ, కుతూహలం, తన high voltage ఎనర్జీ నన్నేకాదు ప్రతి ప్రేక్షకుడిని ఆశ్చర్య చకితులని చేస్తుంది, కానీ దర్శకుడు "కార్తికేయ" క్యారక్టర్ ను డిజైన్ చేసిన తీరు పేలవంగా ఉంటుంది ఎందుకంటే కథ ,కథనాలు stereotype కావడం.
ఇకపోతే "చలో " సినిమా ఇది స్టీరియోటైప్,రొటీన్ కథలకు తండ్రి లాంటిది.ఈ సినిమా భావదారిద్ర్యానికి ఒక చక్కటి ఉదాహరణ.సినిమా ఒక ఆర్ట్ . ఆర్ట్ అంటే కల్పితం.ప్రేక్షకుల్లో మూడు ప్రధాన శక్తిలున్నాయి ఆలోచనా ,ఇఛ్చా, అనుభూతి శక్తులు, మానవ జీవితంలో ఈ త్రివేణి సంగమం ప్రవహిస్తేనే ప్రేక్షకుడు రసానందాన్ని పొందుతాడు లేకపోతే పొందలేడు. కల్పితం ఎప్పుడూ నిజం కాదు. కానీ నిజంలాగా కల్పితం అవ్వచ్చు. అ కల్పితం కొద్దో గొప్పో బావుందా లేదా అన్నది ముఖ్యం. సినిమా చూడటం, సినిమాను మలచడం ఒక ఆర్ట్ అవి రెండు మన దర్శకులలో లోపించి ఉంటాయి వాటికి నిదర్శనమే ప్రేక్షకుడి దౌర్భాగ్యం . కథ, కథనం, పాత్రలు, దర్శకులు ప్రేక్షకుల కోణంలోచూడటం నేర్చుకోవాలి తప్ప, నిర్మాతల, low I Q పైన కాదు. సినిమా అత్యంత ప్రభావమైన మాధ్యమం కాబట్టి సగటు ప్రేక్షకుడికి ఏస్తటిక్స్ పై డిస్కస్ చేసే అధికారం ఉంది. ఎందుకంటే ప్రేక్షకుడి టికెట్ కట్ చేయక పోతే సినిమాలేదు, దర్శకులు హీరోలు పొందే సో కాల్డ్ రెమ్యూనరేషన్లు లేవు. ఏదేని కథకి ఓపెనింగ్ ఒక ఇంటర్వెల్ బాంగ్ ఒక ఎండ్ ఉంటుంది. కథ మొదలు పెట్టేటప్పుడే చివర ఏం జరగాలీ అనేది ముందే అనుకొని మధ్యలో ఎలాంటి మలుపులు ఉండాలో, ఎలా ఉంటే రసానందం కలుగుతుందో అని దర్శకుడు రైటర్ ఆలోచించాలి..అలాంటి కౌశలం మన సినిమాల్లో కనిపించవు "ఎందుకంటే? మనం స్టీరియోటైప్?"చివరిగా నాకు హెబెర్ట్ రీడ్ మాటలు గుర్తు కొస్తున్నాయి." నైతిక విలువలు సామాజిక విలువలు అయి ఉన్నాయి, రసాత్మక విలువలు మానవీయ విలువలు అయి ఉన్నాయి ,నైతిక విలువలు జీవితపు ఒకానొక ప్రతేయక మార్గాన్ని ఉన్నత పరిచి సంరక్షిస్తాయి. రసాత్మక విలువలు జీవితాన్నే స్వయంగా ఉన్నతపరిచి సంరక్షిస్తాయి.
..ప్రకాష్ సూర్య,సినీ విమర్శకులు