శనివారం ఉదయం ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఆవరణలోజరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆర్ ఎస్ ఆర్ మాస్టారు మాట్లాడుతూఆసుపత్రి దేవాలయం, రోగులు దేవుళ్ళు అంటూ అటువంటి దేవాలయం లాంటి ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని, రోగికి వైద్యంతో పాటుమంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని ప్రతి నెల 2వ శనివారం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో స్వచ్ఛభారత్ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలోఎంతమంది స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, శనివారపుపేట ప్రభుత్వ బాలుర వసతి గృహ విద్యార్థులు, కే పి టి టి స్కూల్ ఎన్ సి సి విద్యార్థులు, సి ఆర్ ఆర్ కాలేజ్ ఎన్సి సి విద్యార్థులు పాల్గొని ఆసుపత్రిని పరిశుభ్రంగా వుంచ టానికి కృషి చేస్తున్నందుకు వారందర్నీ అభినందిస్తున్నట్లు తెలిపారు.ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడుమానవతా నాగేశ్వర రావు గారు, విజయ్ కుమార్ జైన్ గారు, తన్నీరు బుజ్జి గారు కోనేరు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, కె పి డి టి స్కూల్ ఎన్సిసి మాస్టారు రామయ్యగారు, నాగరాజు, కె పి డి టి ఎన్ సి సి విద్యార్థులు పాల్గొన్నారు.