ఇటీవల పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు సేవలను ప్రారంభించిన పోస్ట్శాఖ వచ్చే రెండేళ్లలో బీమా కంపెనీని కూడా ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. ‘పోస్టల్ డిపార్ట్మెంట్ సరికొత్త రూపును సంతరించుకుంటోంది. పార్శిల్ సర్వీసెస్, పేమెంట్స్ బ్యాంకు సేవల తర్వాత మరో అడుగు ముందుకు వేయబోతోంది. వచ్చే రెండేళ్లలో బీమా కంపెనీని సైతం ప్రారంభించనుంది’ అని సిన్హా వెల్లడించారు.