మూడో రోజు ఆటలో భారత్ ఊహించినదానికన్నా మిన్నగానే ఆడింది. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న దశలో జడేజా (156 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 86 నాటౌట్), విహారి (124 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 56) బాధ్యతాయుత ఇన్నింగ్స్ జట్టును ఆదుకుంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 292 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. జెన్నింగ్స్‌ను షమి.. అలీ (20)ను జడేజా ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ మళ్లీ వరుస వికెట్లు కోల్పోతుందా అనిపించింది. ఐతే కెరీర్‌లో ఆఖరి టెస్టు ఆడుతున్న అలిస్టర్ కుక్, (46 బ్యాటింగ్; 125 బంతుల్లో 3×4), కెప్టెన్ జో రూట్ (29 బ్యాటింగ్; 43 బంతుల్లో 5×4) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు.