అత్యంత ధనికుల్లో ఒకరైన ప్రముఖ జువెల్లరీ నిరవ్ మోడీపై కేసు నమోదయింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించి రూ.280 కోట్ల చీటింగ్ కేసులో భాగంగా ఆయనపై సీబీఐ అభియోగాలు మోపినట్లు అధికారులు తెలిపారు. నిరవ్ మోడీ ఆభరణాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. ఆయన రూపొందించిన ఆభరణాలతో పలువురు ప్రముఖ సెలబ్రిటీలు పలు వేదికలపై కనువిందు చేసారు.
జనవరి 31వ తేదీన ఆయన ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఢిల్లీతో పాటు సూరత్, జైపూర్‌లలోని ఆయన కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. రూ.230 డాలర్ల విలువైన ఫైవ్ స్టార్ డైమండ్ జ్యువెల్లరీ డిజైనర్ సంస్థను నిరవ్ మోడీ స్థాపించారు. విదేశాలకు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు ఫైవ్ స్టార్ డైమండ్ సంస్థకు క్లయింట్లుగా ఉన్నారు.