రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు దేశవ్యాప్తంగా సోమవారం భారత్ బంద్‌ను మరో వైపు పెట్రలో ధరలు మాత్రం యథావిధిగా పెరుగుతూ పోతున్నాయి. బంద్ రోజున కూడా పెట్రోల్, డీజీల్ ధరల పెంపు కొనసాగింది. తాజా పెంపుతో పెట్రోల్ ధర ముంబయిలో రూ.90కి చేరువలోకి వచ్చింది.దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 23 పైసలు, డీజిల్‌పై 22 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.80.73, డీజిల్ రూ.72.83గా ఉంది. ఇక అత్యధికంగా ధరలు ఉండే ముంబయిలో పెట్రోల్ ధర రూ.88.12కి చేరగా.. డీజిల్ ధర రూ.77.32గా ఉంది. ఇక హైదరాబాద్‌లో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ. 85.60, డీజిల్ ధర రూ. 79.22గా ఉంది.కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై రూ.19.48, డీజిల్‌పై రూ.15.33 ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తోంది. ఇక ఆయా రాష్ట్రాల్లో వీటిపై వ్యాట్ కొనసాగుతోంది. అండమాన్ నికోబార్ దీవుల్లో వ్యాట్ తక్కువగా(6 శాతం) ఉంది. ఇదిలా ఉండగా బంద్ నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను 4 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ రాష్ట్రంలో వీటి ధరలు రూ.2.5 తగ్గాయి.పెట్రోలు, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ ఈ రోజు 21 విపక్ష పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్త బంద్ కొనసాగుతోంది.