అసెంబ్లీ వ్యూహ కమిటి సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, విప్ లు, పార్టీ బాధ్యులు పాల్గోన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ సభకు ఎవరూ గైర్హాజరు కారాదు. చర్చలో అందరూ భాగస్వాములు కావాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అందరూ క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. క్వశ్చన్ అవర్ సీరియస్ గా జరగాలి.అనుబంధ ప్రశ్నలతో సమగ్ర చర్చ జరిగేలా చూడాలి. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలి. ప్రతిపక్షం లేదు కాబట్టి ఏదో ఒక సమాధానం ఇచ్చి వెళ్లిపోవడం కాదు. ప్రజలకే మనం జవాబుదారీ అనేది గుర్తుంచుకోవాలి. ప్రతిపక్షం విధ్వంసక ధోరణితో వ్యవహరిస్తోంది. ప్రతిపక్షం లేనందునే సభ అర్ధవంతంగా జరుగుతోంది అని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భావిస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనమే ముందున్నాం. ఈజ్ ఆఫ్ గివింగ్ సిటిజన్ సర్వీసెస్ లోనూ మనమే ముందుండాలి. ఏపి పునర్విభజన చట్టం అమలుపై కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంది. అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.ఇప్పటి ప్రధాని ఇచ్చిన వాగ్దానాలు అమలుకాలేదు. దేశవ్యాప్తంగా బిజెపిపై వ్యతిరేకత ప్రబలంగా ఉంది. పెట్రో,డీజిల్ ధరలు విపరీతంగా పెంచేశారు. దీంతో నిత్యావసర ధరలు మరింత పెరుగుతాయి. ఎన్నికల ముందు అవినీతిపై యుద్దం అన్నారు. ఇప్పుడేమో అవినీతిపరులతో అంటకాగుతున్నారు. వీటన్నింటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అయన సూచించారు.