YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

‘భారత్‌ బంద్‌’ విజయ వంతం హద్దులను దాటేసిన మోదీ ప్రభుత్వం: మన్మోహన్‌ సింగ్‌

‘భారత్‌ బంద్‌’ విజయ వంతం  హద్దులను దాటేసిన మోదీ ప్రభుత్వం: మన్మోహన్‌ సింగ్‌

రికార్డు స్థాయిలో పెరుగుతున్న చమురు ధరలకు నిరసనగా కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రతిపక్షాలు సోమవారం చేపట్టిన ‘భారత్‌ బంద్‌’ దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, ఎల్‌జేడీ నేత శరద్‌ యాదవ్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు నిరసనలో పాల్గొన్నారు. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలు ధరల పెంపుపై నిరసన ప్రదర్శనలు చేశారు. బిహార్‌ రాజధాని పట్నాలో ఎల్‌జేడీ కార్యకర్తలు రైల్వే ట్రాక్‌పైకి చేరి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు గుజరాత్‌లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ధరల పెంపునకు నిరసనగా రోడ్లపైకి చేరిన ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు.దీంతో ట్రాఫిక్‌ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. బంద్‌ నేపథ్యంలో ముంబయి లోకల్‌ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల కార్యకర్తలు పెట్రోల్‌ బంక్‌ల వద్దకు వెళ్లి వాటిని మూయించారు. మరోవైపు బంద్‌ దృష్ట్యా కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పలు ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు.పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ సోమవారం ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపు మేరకు డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీ(ఎస్‌) సహా 21 విపక్ష పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు ఈ బంద్‌లో పాల్గొన్నాయి.కాగా భారత్ బంద్ లో ప్రతిపక్షలు ఢిల్లీలో నిరసన చేపట్టాయి.ఈ కార్యక్రమం లో  ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అన్ని హద్దులను దాటేసిందని, ప్రజా పాలనలో దారుణంగా విఫలమైందని విమర్శించారు. మోదీ ప్రభుత్వ అవలంబిస్తున్న వైఖరిని ఆయన తప్పుపట్టారు. బీజేపీ ప్రభుత్వం అక్రమంగా అన్ని పరిమితులను అతిక్రమించిందన్నారు. దేశ ప్రజలకు ప్రయోజనకరమైన అంశాలను మోదీ ప్రభుత్వం ఏదీ చేపట్టలేకపోయిందని, ఆ ప్రభుత్వం అన్ని హద్దులను దాటేసిందన్నారు. రైతులను ఆదుకోవడంలో మోదీ సర్కార్ దారుణంగా విఫలమైందన్నారు. కలిసి కట్టుగా ఐకమత్యంతో శాంతియుతంగా దేశాన్ని రక్షించుకోవాలని మన్మోహన్ ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. భారత్ బంద్‌లో మొత్తం 21 విపక్ష పార్టీలు పాల్గొన్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందరం ఏకం కావాలని మన్మోహన్ అన్నారు.

Related Posts