పెట్రోల్, డీజిల్పై రూ.2 తగ్గించిన ఏపీ సర్కార్. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కల్గిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై రూ.2 మేర వ్యాట్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రకటించారు. పెట్రోల్ బాదుడుకు నిరసనగా ఈ రోజు ప్రతిపక్షాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.