రాజధాని పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారు. అమరావతిలో ఎమ్మెల్యేల నివాసాలు ఎక్కడ నిర్మించారో మాకు కనిపించడం లేదు. నివాసాలు నిర్మించామని నిధులు తీసుకున్నారు. శాసనమండలి అబద్ధాల సభకు నిలయంగా మారిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. సోమవారం అయన అసెంబ్లీ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రరాష్ట్రాన్ని విభజించడానికి మీరు సహకరించా లేదా? నీతి లేని,నిజాయితిలు లేని అవినీతి పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర విభజన సమయంలో ఆంద్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయంపై టీడీపీ ఎంపీలు ప్రశ్నించారా? అరిగిపోయిన రికార్డులాగా రాజధాని అని పదే పదే అమరావతి పేరు చెప్తున్నారని అన్నారు. రాజధానికి 1500కోట్లు ఇస్తే కారిపోతున్న తాత్కాలిక రాజధాని కట్టారు. శాసనసభ,శాసనమండలిలో అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ సభ్యులు ప్రశ్నిస్తుంటే ముప్పేట దాడి చేస్తున్నారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. నిర్మాణం చెయ్యని రాజధానికి అసెంబ్లీలో డబ్బా కోట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుందని అన్నారు. దేశంలో విడిపోయిన రాష్ట్రాలు అన్ని తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మించాయి. బీజేపీ,టీడీపీ కలిసి ఉన్నప్పుడు పొగుడుతూ తీర్మానాలు చేశారు. విడిపోయాక సభలో మోడీని తిడుతూన్నారు. కేంద్రం ఇచ్చిన 32వేళా కోట్ల రూపాయల nregs నిధులను టీడీపీ నేతలు మింగేశారు. డ్రైనేజీలు కట్టడానికి కేంద్రం 1000కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కట్టలేక పోయిందని అయన అన్నారు. హైదరాబాద్ లో చేసిన తప్పు అమరావతిలో చేస్తున్నారు. రాజధాని నిర్మాణం మీకు చేతకాకపోతే మాకు ఇవ్వండి మేము నిర్మించి చూపిం. రాజధాని పేరుతో విదేశీ సంస్థలకు భూములు దోచి పెడుతున్నారు..సభలో బీజేపీ సబ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు కాబట్టే సభ నుంచి వాక్ ఔట్ చేస్తున్నామని అయన అన్నారు.