కళ్ళు ఉండి చూడలేని స్థితిలో బీజేపీ నేతలు ఉన్నారు. రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా 2000కోట్ల రూపాయలు విగ్రహానికి ఇచ్చారు. శాసనసభ్యుల నివాసాలు ఎక్కడ నిర్మిస్తున్నారో మేము చూపిస్తాంమని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. మోడీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించండి. సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి సీఎం చంద్రబాబు ఇచ్చిన విషయాన్ని మర్చిపోవద్దు. ప్రధాని మోదికి బీజేపీ నేతలు చెంచాగిరి చెయ్యడం సరైన పద్ధతి కాదు. రాజధానికి చిల్లు పడటం కాదు దేశంలో 140కోట్ల మంది ప్రజలకు చిల్లు పెట్టారు అది గుర్తు పెట్టుకోవాలి. మోడీని ఎప్పుడు గద్దె ధింపుదామా అని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. అవినీతిలో రాక్షసుడు లాంటి వాడి జగన్ మోహన్ రెడ్డి. బోగస్ కంపెనీల పేరుతో వేళా ఎకరాల భూములను జగన్ దోచుకుంటున్నారని అయన ఆరోపించారు.