మహ కూటమితో కాంగ్రెస్ కు లాభమా నష్టమా....ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడితే కాంగ్రేస్ ఆ 30 సీట్లను త్యాగం చేయక తప్పదా ... పోత్తుల సమీకరణాలతో కాంగ్రేస్ లో అగ్ర నేతలు తమ సొంత సీట్లు వదులుకోక తప్పదా ...అదే జరిగితె కాంగ్రేస్ లో ఏం జరుగుతుంది ...పెద్దన్న పాత్ర పోషించాలనుకుంటున్న కాంగ్రేస్ త్యాగం చేయక తప్పదా ... అంటే ఔననే సమాధానమే వస్తోంది.. తెలంగాణలో ప్రతిపక్షాలు మహాకూటమిగా జతకట్టబోతున్నాయి. ఆ దిశగా వేగంగా రాజకీయాలు మారుతున్నాయి..ఇప్పటికే టిడిపి ,సిపిఐ అవగహనకు వచ్చాయి ..ఇక కాంగ్రేస్ ఇప్పటికే తమతో కలసి వచ్చే పార్టీలతో ఏన్నికలు వెళ్తామని ముందే ప్రకటించింది ..ఇక టీ జేఏస్ నేతలతో టీ టిడిపి అద్యక్షుడు ఏల్ రమణ చర్చలు జరుపుతున్నారు. దీంతో ఒకటి రెండు రోజుల్లో మహా కూటమిలో ఏ పార్టీలు ఉండనుండేది తేలిపోనుంది ...అయితే మహా కూటమి ఏర్పడితే ప్రధాన ప్రతిపక్ష కాంగ్రేస్ 30 కి పైగా అసెంబ్లీ స్థానాలు త్యాగం చేయాల్సిన పరిస్తితి వచ్చే అవకాశం ఉంది ..ఇప్పటికే కాంగ్రేస్ లో టిక్కెట్ల పంచాయితీ మొదలైంది. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు నేతలు కాంగ్రేస్ టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు ..ఈ మహా కూటమి ఏర్పడితె కాంగ్రేస్ కోన్ని స్థానాలు ఇతర మిత్ర పక్షాలకు కేటాయించక తప్పదు ..దీంతో కాంగ్రేస్ పార్టీ నేతల్లో గుబులు పుడుతుంది ..తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారుపోత్తులో భాగంగా కాంగ్రేస్ ,టి టిడిపి ,సీపిఐ ,తెలంగాణ జనసమితి ఈ నాలుగు పార్టీలు కలసి మహ కూటమిగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది..వరంగల్ జిల్లాలో పరకాల ,నర్సంపేట నియోజక వర్గాలను టీడిపి అడుగుతున్నట్లు సమాచారం,వరంగల్ వెస్ట్ ను టీజేఏస్ అభ్యర్థి ని పోటీ చేయించాలని ఆపార్టీ భావిస్తుందట .అయితే నర్సంపేట నియోజకవర్గం నుంచి కాంగ్రేస్ సిట్టింగ్ ఏమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పరకాల టిక్కెట్ హామితో కోండా కాంగ్రేస్ కండువా కప్పుకోనున్నారు దీంతో ఈ సీట్ పై ఇరు పార్టీల మధ్య పీట ముడి పడనుంది... ఇతర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి . పలుచోట్ల కాంగ్రేస్ సిట్టింగ్ స్థానాల కోసం టీడిపి పట్టుపడుతుంది ..పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏల్ రమణ జగిత్యాల సీటు ను కోరుతున్నారు ....ఇక్కడ సీఏల్పీ ఉపనేత జీవన్ రెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. వనపర్తి కాంగ్రేస్ సిట్టింగ్ స్థానమే కాక టిడిపి పోలీట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఇదే సీటు ను ఆశిస్తున్నారు ..దీంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది.ఇలా ఇతర జిల్లాల్లో పలు సీట్ల పై ఇరుపార్టీలు పట్టుబుడుతున్నాయి. దీంతో టిక్కెట్లు రాని వారు రెబల్ గా బరిలోకి దిగితే మహా కూటమి లక్ష్యాలు దెబ్బతినే ప్రమాదం ఉంది ..అందుకే ఆచీ తూచీ ఇరు పార్టీల నాయకులు వ్యవహరిస్తున్నారు ..అయితే టీడిపి ,టీ జేఏస్ ,సిపిఐ ,కోన్ని సీట్లను కావాల్సిందే అంటూ పట్టబడుతున్నాయి ..ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి ,ఖమ్మం టౌన్ ,భధ్రాచాలం ,అశ్వరావు పేట సీట్ల కోసం టీడిపి పట్టుబడుతుండగా కోత్తగుడెం ,వైరా కోసం సీపిఐ కోరుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మెజారిటి స్తానాలను టీడిపి కోరుతుంది ...శేరిలింగంపంల్లి ,కూకట్ పల్లి ,జూబ్లిహిల్స్ ,రాజేంద్రనగర్ ,మేడ్చెల్ ,ఉప్పల్ సీట్లను తమకు కేటాయించాల్సేందనని టీడిపి డిమాండ్ గా ఉంది..ఈ సీట్ల లో గతంలో టిడిపి గెలుచుకంది కోన్ని కాగా మిగిలిన సీట్ల లో టిడిపి సీనియర్లు పోటీకి సై అంటుంన్నారు ..నల్గోండ విషయానికి వస్తే సూర్యాపేట ,కోదాడ ను టిడిపి ,దేవరకోండ ను సీసీఐ ఆశిస్తోంది ..కరింనగర్ హుస్నాభాద్ నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి,ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నుండి సిపిఐ అభ్యర్దిగా గుండా మల్లేష్ టిక్కెట్ ఆశిస్తున్నారు ..సిద్దిపేట నుంచి టిజేఏస్ అభ్యర్ది భవాని రెడ్డి ప్రచారం మోదలు పెట్టారు ... నిజామాబాద్ రూరల్ ,ఆర్మూర్ ,బాల్కోండ నియోజక వర్గాలను మాకు కేటాయించాల్సిందేనని టిడిపి పట్టబడుతుంది .ఇక మహబూబ్ నగర్ లో దేవరకద్ర ,షాద్ నగర్ ,మక్తల్ ,జడ్డర్ల ను పోత్తులో భాగంగా మేమ పోటిచేస్తామని టిడిపి నేతలు పట్టుబడుతున్నారు..ఇలా పదుల సంఖ్యలో సీట్ల పై,సిపిఐ ,టిడిపి ,జనసమితి పట్టుబడుతుండడంతో కాంగ్రేస్ త్యాగాలకు తప్పని పరిస్థితి. .ఈ మూడు పార్టీలు కలసి కనీసం 30 స్థానాల్లో పోటిచేయాలని భావిస్తుండడంతో కాంగ్రేస్ 90 స్తానాల్లోనే సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ..దీంతో కాంగ్రేస్ ప్రమాదం ఉందని సోంతపార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ...టిక్కెట్ దక్కలేదన్న కోపంతో మహా కూటమి భాగస్వామ్య పక్ష్యాల మద్య ఓట్ల బదిలీ జరగని పక్షంలో టిఆర్ఏస్ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది ..అందుకే అసంతృప్తులను బుజ్జగించిన తరువాత మహాకూటమి పక్షాన అభ్యర్దులను ప్రకటించాలని భావిస్తున్నారు .