చాన్నాళ్లుగానే తల్లి, అత్త తరహా పాత్రల్లో నటిస్తూ వస్తోంది రమ్యకృష్ణ. ఒకప్పుడు గ్లామర్ డాల్‌గా వెలుగొందిన రమ్య ఇప్పుడు నేటి తరం గ్లామర్ డాల్స్‌కు తల్లి, అత్త పాత్రల్లో నటిస్తూ ఉంది. స్వతహాగా నటనాపటిమ ఉండటంతో ఇలాంటి పాత్రలను అవలీలగా చేసుకు వస్తోంది రమ్యకృష్ణ. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఆమె టైటిల్ రోల్‌లో నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా విడుదల కాబోతోంది.ఈ సినిమాలో శైలజారెడ్డిగా రమ్య నటించింది. ఈ వారంలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పుడు రమ్యకు ఈ తరహా పాత్రల విషయంలో కొంత పోటీ కూడా ఉంది. అవతల నదియా ఇలాంటి పాత్రలకు కేరాఫ్ అయ్యింది. ‘అత్తారింటికి దారేదీ’, ‘అఆ’ వంటి సినిమాలతో నదియా అందరినీ కట్టి పడేసింది. దీంతో.. పొగరుబోతు అత్త పాత్రలు నదియాకే దక్కే పరిస్థితి వచ్చింది. అయితే ‘బాహుబలి’ రమ్యకృష్ణకు ప్లస్ పాయింట్ అయ్యింది.ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ‘శైలజారెడ్డి అల్లుడు’ కూడా హిట్ అయితే.. నదియకు రమ్యకృష్ణకు మధ్యన పాత్రల విషయంలో పోటీ మొదలైనట్టే. ఇక పారితోషికం విషయంలో వీరిద్దరూ ఒకే స్థాయిలో ఉన్నారని టాక్.రమ్యకృష్ణ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. మామూలుగా ఆమె రోజువారీగా డేట్స్ కేటాయిస్తే ఒక్కో రోజుకు ఐదు లక్షల రూపాయల రెమ్యూనరేషన్‌ను చార్జ్ చేస్తుందట. అదే ఫుల్ లెంగ్త్ పాత్రలో నటిస్తే ఒక్కో సినిమాకు కోటి రూపాయల వరకూ తీసుకుంటుందని సమాచారం. ప్రస్తుతం లీడ్‌లో ఉన్న చాలా మంది హీరోయిన్లతో పోలిస్తే.. రమ్య పారితోషికం చాలా ఎక్కువే!