YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

మార్చి నాటికి నిట్ కు సొంత భవనం

మార్చి నాటికి నిట్ కు సొంత భవనం

ప్రతిష్ఠాత్మకమైన ఏపీ నిట్‌ను 2015లో తాడేపల్లిగూడేనికి  మంజూరు చేశారు. మూడేళ్ల కాలవ్యవధిపై పెదతాడేపల్లిలోని వాసవి ఇంజినీరింగ్‌ కళాశాలలో తాత్కాలిక తరగతులను చేపట్టారు. ఏపీ నిట్‌ శాశ్వత భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆయా నిర్మాణ పనులకు రూ.190 కోట్లతో టెండర్లు పిలవగా పూణెకు చెందిన బీజీ షర్కీ కంపెనీ దక్కించుకోవటంతోపాటు సీపీయూడబ్ల్యూవో అధికారుల ఆమోదం కూడా పొందింది. దీంతో పట్టణంలోని విమానాశ్రయ భూముల్లో నిట్‌కు కేటాయించిన 172 ఎకరాల్లో తొలిదశ భవన నిర్మాణాలను చేపట్టింది. ఇందుకు సంబంధించిన నిర్మాణ సామగ్రిని కంపెనీకి చెందిన లారీల్లో ఇక్కడకు తరలించింది. ఆయా భవన నిర్మాణ పనుల్ని 13 నెలల్లో పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురానుంది.  ప్రస్తుతం నాలుగో విద్యా సంవత్సరం నడుస్తుండటంతో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిట్‌ అధికారులు వాసవితోపాటు ప్రత్తిపాడులోని ఆకుల గోపయ్య ఇంజినీరింగ్‌ కళాశాలను కూడా తీసుకుని వాటిల్లో విద్యార్థులకు తాత్కాలిక తరగతులను నిర్వహిస్తున్నారు. బాలుర వసతిగృహాలను మూడు చోట్ల, బాలికల వసతిగృహాలను రెండుచోట్ల నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చేపట్టిన భవన నిర్మాణ పనుల్ని త్వరితగతిన పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొస్తే విద్యార్థులకు పూర్తిగా ఇక్కట్లు తీరిపోనున్నాయి.విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు తొలిదశలో తరగతి గదులు, వసతిగృహాలు, బాలురు, బాలికలకు వేర్వేరుగా భోజన హాలు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, ఇండోర్‌ స్టేడియం, అకడమిక్‌ భవనం వంటి వాటిని నిర్మించనున్నారు. ఇప్పటికే భవన నిర్మాణాలను ఎన్ని అంతస్థుల్లో నిర్మించుకోవచ్చో తెలుసుకునేందుకు వీలుగా నిట్‌ శాశ్వత ప్రాంగణంలో సేఫ్‌ బేరింగ్‌ కేపాసిటీ  పరీక్షలను నిర్వహించి ఆయా నమూనాలను హైదరాబాద్‌లోని ప్రయోగశాలకు పంపించారు. ప్రస్తుతం ఆయా భవన నిర్మాణాలను జీ+ 2 కేటగిరిలో నిర్మించి వినియోగంలోకి తీసుకురానున్నారు. షర్కీ కంపెనీకి చెందిన ఇంజినీర్లతోపాటు సీపీయూడబ్ల్యూవో అధికారులు కూడా నిర్మాణ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. వీరు విధులు నిర్వర్తించుకునేందుకు, ఉండేందుకు రన్‌వేపైన, రన్‌వేకి పక్కన తాత్కాలిక షెడ్లను ఏర్పాటుచేసుకోగా, కార్మికులు ఉండేందుకు కొండాలమ్మ గుడివైపున తాత్కాలిక షెడ్లను ఏర్పాటుచేసుకున్నారు. 

Related Posts