శాసన మండలి లో అధికార పక్షం తప్ప వేరే వారు మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారు. అందుకే వాకవుట్ చేస్తున్నామని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. మంగళవరం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడారు. నిరుద్యోగ భృతి ని హామీ గా ఇవ్వడం జరిగింది. దీనిని అక్టోబర్ 2 న ప్రారంభిస్తున్నాం అన్నారు. కేవలం ఆరు నెలలు మాత్రమే ఇచ్చి ఎన్నికలలో లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిరుద్యోగ భృతి కాదు. ఎన్నికల భృతి.అని అన్నారు నిరుద్యోగ భృతి 4 సంవత్స రాలుగా పెండింగ్ లో ఉంది. సీపీఎస్ ని రద్దు చేసి తీరాలి.. సీపీఎస్ అనేది కేంద్రానికి సంభంధించినది కాదు. అసెంబ్లీ లో తీర్మానం చేసి సీపీఎస్ విధానాన్ని అమలు పరచాలని అయన అన్నారు.