YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికలకు సిద్ధం కండి

ఎన్నికలకు సిద్ధం కండి
విశాఖపట్నంలో మంగళవారం నాడు వైకాపా  పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు   వైయస్ జగన్మోహన్రెడ్డి, ఇతర నేతలు భేటీలో పాల్గోన్నారరర. జగన్ మాట్లాడుతూ మరో నాలుగైదు  నెలల్లో, అంటే జనవరిలో ఎన్నికలు జరగబోతున్నాయనే సంకేతాలు ఉన్నాయి. ఎన్నికలను ఎదుర్కొనేందుకు జనవరి నాటికి సర్వం సిద్ధం కావాలని అన్నార..ఒకవైపు పాదయాత్ర కొనసాగుతుండగానే నియోజకవర్గాలవారీగా, బూత్ల వారీగా కార్యక్రమాలు జరగాలి.సెప్టెంబరు 17 నుంచి బూత్లవారీగా కార్యక్రమాలు జరగాలని అన్నారు. ప్రతి నియోజకవర్గం సమన్వయ కర్త ప్రతిరోజూ 2 బూత్లను గడపగడపకూ వెళ్లి సందర్శించాలి. వారంలో ఐదు రోజులపాటు ప్రతి బూత్లోని కుటుంబాలతో మమేకం కావాలి.. వారి సమస్యలు, ఇతరత్రా అంశాలు గుర్తించాలి. ఆయా బూత్కమిటీతో సమీక్షచేసుకోవాలి, ఓటర్లుజాబితాల్లో చేర్పులు, సవరణలపై దృష్టిపెట్టాలి. ఎన్నికలు సమీపిస్తున్నందున గడపగడపకూ వెళ్లడానికి మనకు సమయంలేదు, ఇదే ఆఖరి అవకాశమని అయన అన్నారు. మొదటి విడతలో పార్టీ నిర్దేశించిన మొదటి 50 బూత్ల సందర్శన, మొదటి నెలలో పూర్తిచేయాలి. సమాంతరంగా నియోజకవర్గాల్లోని, మండలాల్లోని బూత్ మేనేజర్ల బూత్ కమిటీలపై దృష్టిపెట్టాలి. ఎక్కడ లోపాలున్నా వాటిని గుర్తించి వెంటనే సరిదిద్దాలి. ప్రతి 30–35 కుటుంబాలకు బూత్కమిటీ సభ్యుడు వుండాలని అన్నారు. నవరత్నాలపై కుడా  పార్టీ నాయకులతో వైయస్ జగన్ స్రస్తావించారు. నవరత్నాలు అనేవి ప్రజల్లో నమ్మకం కలిగించాయి. ప్రతి ఇంటికీ నవరత్నాలను చేర్చాలి. ఇది జరిగితేనే చంద్రబాబు ప్రలోభాలను అడ్డుకోగలం. నవరత్నాలద్వారా ఒక కుటుంబానికి ఎంత మేలు చేకూరుతుందనే విషయాన్ని వివరించాలని అన్నారు. చంద్రబాబు ప్రలోభాల కన్నా నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికీ ఎలాంటి మేలు జరుగుతుందనే అంశాన్ని వివరించాలి. ఇది మాత్రమే చంద్రబాబు ప్రలోభాలను తిప్పికొట్టగలదు. నవరత్నాలు ప్రజల నోళ్లల్లో నానాలని అయన అన్నారు. నవరత్నాలు ద్వారా ఎలాంటి మేలు జరుగుతుందనే విషయాన్ని తెలియజేయాలి. నవరత్నాలు వివరిస్తూ రూపొందించిన పోస్టర్ను విడుదల చేసారు. 

Related Posts