రెవెన్యూ అధికారుల పోస్టుల రాత పరీక్షకు హాజరయ్యేందుకు హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. హాల్‌టికెట్లు పొందడంలో అభ్యర్థులకు ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా.. హెల్ప్ సెంటర్ - 040-24606666 నెంబరులో సంప్రదించవచ్చు. లేదా ఉప సెక్రటరీ నెంబరు - 72888 96615, అసిస్టెంట్ సెక్రటరీ - 72888 96626), సెక్షన్ ఆఫీసర్ - 7288896653 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని ఆమె సూచించారు.తెలంగాణలో 700 వీఆర్వో పోస్టుల భర్తీకి సంబంధించి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా 10.58 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్‌వో ఉద్యోగాలకు ఇంటర్ విద్యార్హత కాగా.. డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ అభ్యర్థులు కూడా పెద్దమొత్తంలో దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సెప్టెంబరు 16న రాతపరీక్ష నిర్వహించనున్నారు.పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. 150 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో సెక్రటేరియట్ ఎబిలిటీ నుంచి 75 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 150 నిమిషాలు.
సిలబస్ ఇలా...
* జనరల్ నాలెడ్జ్ - 75 ప్రశ్నలు (75 మార్కులు)
* సెక్రటేరియల్ ఎబిలిటీస్ - 75 ప్రశ్నలు (75 మార్కులు)
* ఆంగ్ల భాష ప్రాథమికాంశాలు (ఎనిమిదో తరగతి స్థాయి)
* మెంటల్ ఎబిలిటీ (వెర్బల్, నాన్ వెర్బల్)
* లాజికల్ రీజనింగ్
* న్యూమరికల్ ఎబిలిటీస్
* అరిథ్‌మెటికల్ ఎబిలిటీస్
ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ
జయశంకర్ జిల్లా ములుగు అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో 24 ప్రొఫెసర్, అసోసియేట్, సహాయ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మరిన్ని వివరాలను కమిషన్ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.