ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో నాకు ప్రాణహాని ఉందంటూ ఓ వ్యక్తి హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. సురేష్ అనే వ్యక్తి గురువారం నగరంలోని బంజరాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మంత్రి దేవినేనిపై ఫిర్యాదు చేశారు. అమరావతిలోని తన భూమిని అమ్మాలని మంత్రి ఒత్తిడి తెస్తున్నారని ఆ యువకుడు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేగాక మంత్రి వల్ల నాకు ప్రాణహాని ఉందంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.