YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

వారి కర్మకే వదిలేస్తా..

 వారి కర్మకే వదిలేస్తా..

 - తమ్ముడు మోహన్‌బాబు’ వ్యాఖ్యలపై స్పందన

ఈవెంట్‌లో హీరో మోహన్‌బాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ్ముడు మోహన్‌బాబు అని సంబోధించిన విషయం గుర్తుండే ఉంటుంది. చిరంజీవిపై మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా అప్పట్లో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోహన్‌బాబు ఆ సందర్భంలో పవన్ వ్యాఖ్యలపై స్పందించలేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మోహన్‌బాబు ఈ వ్యాఖ్యలపై స్పందించారు. తనను ఏం మాట్లాడవద్దంటూ దాసరి చెప్పారని మోహన్‌బాబు అంగీకరించారు. పవన్ కల్యాణ్ అలా ఎందుకన్నాడా అని ఆలోచించానని, కానీ సర్లే ఏమైందిలే అని వదిలేసినట్లు మోహన్‌బాబు చెప్పారు. కొన్ని వినీవిననట్టు వెళ్లిపోవాలి తప్ప, ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఆలోచన లేదని ఆయన బదులిచ్చారు. అయినా అందరూ తనకు మిత్రులేనని, ఎవరూ ఏమనుకున్నా వారి కర్మకే వదిలేస్తానని మోహన్‌బాబు స్పష్టం చేశారు. 

Related Posts