YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనసేన తొలి అభ్యర్ధిగా పితాని బాలకృష్ణ

 జనసేన తొలి అభ్యర్ధిగా పితాని బాలకృష్ణ
ఎన్నికల బరిలోకి దిగుతామని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ అడుగు ముందుకేసి ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జనసేన తరుపు‌న పోటీ చేసే మొదట అభ్యర్థిని ఆయన మంగళవారం  ప్రకటించారు. ఎన్నికల్లో మొట్టమొదటి బీఫారం పితాని బాలకృష్ణకు కేటాయిస్తానని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం‌ స్థానం నుంచి పితాని బాలకృష్ణ ఏపీ అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. తనపై నమ్మకంతో పితాని జనసేనలోకి వచ్చారని, ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదని పవన్ వివరించారు. ‘నేను మాట ఇస్తే.. వెనక్కి తీసుకోను. నష్టం వచ్చినా సరే ముందుకే వెళ్తా’ అని పవన్ అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం వల్ల తాను పితానికి టికెట్ ఇస్తానని చెప్పడంలేదని. ఆయన పట్టుదలను చూసి ఇస్తున్నానని పవన్ స్పష్టం చేశారు. అన్ని కులాలు, జాతుల వారికి పితాని న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ మాజీ కోఆర్డినేటర్‌ పితాని బాలకృష్ణ ఆ పార్టీకి ఆగస్టు 22న రాజీనామా చేశారు. అనంతరం జనసేన పార్టీలో చేరారు. మరో 8 ఏళ్లు తనకు ప్రభుత్వ సర్వీసు ఉన్నా వైసీపీ అధినేత జగన్‌ టిక్కెట్‌ ఇస్తారనడంతో ఉద్యోగాన్ని వదులుకున్న పితాని ఆ పార్టీలో చేరారు. పవన్‌ కళ్యాణ్‌ సిద్ధాంతాలు, సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితుడినై జనసేనలో చేరినట్లు పితాని తెలిపారు

Related Posts