తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది అక్కడి దేవస్థానం. ఈ బ్రహ్మూత్సవాల్లో ఉదయం వాహనసేవ 9 నుండి 11 గంటల వరకు, రాత్రి వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహన సేవ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. భక్తుల రద్దీ ద ష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. భక్తుల అవసరాలను ద ష్టిలో ఉంచుకుని రోజుకు 7 లక్షల లడ్డూలను నిల్వ ఉంచారు. వయోవ ద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, దాతలు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. బ్రేక్ దర్శనం ప్రోటోకాల్ ప్రముకుఖులకు మాత్రమే పరిమితం. గరుడ సేవ రోజులైన సెప్టెంబరు 17, అక్టోబరు 14న బ్రేక్దర్శనాలు పూర్తిగా రద్దు చేశారు. అంగప్రదక్షిణ టోకెన్లు కూడా ఇవ్వరు. బ్రహ్మూత్సవాల్లో శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టిటిడి నిఘా మరియు భద్రతా విభాగం, పోలీసు విభాగం సంయుక్తంగా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ముఖ్య కూడళ్లలో సిసిటీవీలు ఏర్పాటు చేశారు. పిఏసి-4లోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్లో నూతనంగా వీడియోవాల్ ఏర్పాటు చేశారు. దీనిద్వారా పలు ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తారు. హోంగార్డులు, ఎన్సిసి విద్యార్థులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. భక్తులు భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు టోల్ఫ్రీ నంబర్లు : 18004254141, 1800425333333కు ఫిర్యాదు చేయవచ్చు. బ్రహ్మూత్సవాలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక టోల్ఫ్రీ నంబరు 18004254242ను అందుబాటులో ఉంచారు. 98 కోట్ల వ్యయంతో మహిళలకు, పురుషులకు వేరువేరుగా నిర్మించిన శ్రీవారి సేవా సదన్ నూతన భవనాలను బ్రహ్మూత్సవాల్లో ప్రారంభిస్తారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే సరుకులు నిల్వ ఉంచు కునేందుకు 1.10 కోట్లతో నిర్మించిన నూతన ఉగ్రాణం భవనాన్ని ఈ బ్రహ్మూత్సవాల్లో ప్రారంభిస్తారు. వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండేందుకు 60 లక్షలతో షెడ్డు నిర్మించారు. భక్తుల సౌకర్యార్థం 26 కోట్లతో అదనపు మరుగుదొడ్ల నిర్మాణం చేశారు. అత్యవసర సమయాల్లో భక్తుల సౌకర్యార్థం ఉత్తర మాడ వీధిలోని అర్చక భవనం నుండి మేదరమిట్ట వరకు ఫుట్ ఓవర్బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చారు. లక్షలాది భక్తులు వాహన సేవలు వీక్షించేందుకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో గ్యాలరీలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వాహనసేవలను తిలకిం చేందుకు మాడ వీధుల్లో 19, భక్తుల రద్దీ ఉన్న ఇతర ప్రాంతాల్లో 12 కలిపి మొత్తం 31 పెద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.