YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

టార్గెట్ పళని స్వామి

 టార్గెట్ పళని స్వామి
నమ్మితే నట్టేట ముంచిన తమిళనాడు ముఖ్యమంత్రిని ఎలాగైనా ఓడించి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు. నమ్మకద్రోహం చేసిన వారిని వదిలి పెట్టేది లేదని  కొద్ది రోజులుగా టీటీవీ దినకరన్ హెచ్చరిస్తున్నారు. టీటీవీ దినకరన్ తమిళనాడులోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. త మృతి చెందిన తర్వాత తమ కనుసన్నల్లో నడవాల్సిన తమిళనాడు రాజకీయాలను పళనిస్వామి కారణంగా శశికళ కుటుంబం చేజార్చుకున్న సంగతి తెలిసిందే. పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఒక్కటై శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. ఢిల్లీ పెద్దల అండతో ప్రభుత్వాన్ని పళని, పన్నీర్ లు నెట్టుకొస్తున్నారన్న విమర్శలు విపక్షాలు చేస్తున్నా వారు పెద్దగా పట్టించుకోవడం లేదు. తమిళనాడులో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాడు తిరుప్పరకుండ్రం, తిరువారూర్ శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.తన వెంట వచ్చి అనర్హత వేటుకు గురైన 18 మంది ఎమ్మెల్యేలలకు జిల్లాల బాధ్యతలను అప్పగించారు. వీరంతా జిల్లాల్లో పర్యటించి పార్టీ సభ్యత్వాలను పెంచడమే కాకుండా ముఖ్యమైన నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునే ప్రయత్నం చేయాలని వారిని ఆదేశించారు.గతంలో జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకేను కంగుతినిపించిన టీటీవీ దినకరన్ ఈ రెండు నియోజకవర్గాల్లోనూ పాగా వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు ప్రకటించారు. తిరువారూర్ నియోజకవర్గానికి డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ప్రాతినిధ్యం వహించేవారు. తిరుప్పరకుండ్రం నియోజకవర్గానికి అన్నాడీఎంకేకు చెందిన బోస్ ప్రాతినిధ్యం వహించేవారు. ఇద్దరూ అకాల మరణంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఎన్నికల్లో తాను గెలవకున్నా అన్నాడీఎంకేను గెలవనీయకుండా పళనిస్వామిని దెబ్బతీయాలన్నది టీటీవీ వ్యూహంగా కన్పిస్తోంది.మరోవైపు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎడప్పాడి నియోజకవర్గంలో కూడా టీటీవీ దృష్టిపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, లోక్ సభ ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో పైచేయి సాధించి పళనిస్వామిని మానసికంగా దెబ్బతీయాలన్న ఆలోచనలో దినకరన్ ఉన్నారు. అందుకోసం ఎడప్పాడి నియోజకవర్గంలో టీటీవీకి చెందిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నియోజకవర్గం వ్యాప్తంగా పళనికి వ్యతిరేకంగా ప్రదర్శనలను నిర్వహించడమూ చర్చనీయాంశమైంది. దీనిపై ముఖ్యమంత్రి పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనలకు ఎలా అనుమతిస్తారని పోలీసు అధికారులపై పళని ఫైరయ్యారని తెలుస్తోంది. మొత్తం మీదపళనిని దెబ్బతీయాలన్న దినకరన్ వ్యూహం ఫలిస్తుందా? అనేది వేచిచూడాల్సిందే.

Related Posts