అఖిలాండ కోటి బ్రహ్మాండ నయకుడి బ్రహోత్పవాలకు సప్త గిరులు భక్తజన కోటిని స్వాగతం పలుకుతున్నాయి.ప్రతీ ఏటా అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూ లల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తిరుమల గిరిపై విచ్చేసి స్వామి వారి సేవల్లో పాల్గోని తరించిపోతారు. గురువారం నుంచి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహోత్పవాలకు సర్వం సిద్దమైంది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సంబరం మొదలైంది. వైభోవేతంగా జరుగుతున్న ఉత్సవాలను కనులారా వీక్షించి తరించాలని భక్తకోటి తిరుమల వీధులకు చేరింది. లక్షలాదిగా తరలివస్తున్న భక్తజనులకు తిరుమల గిరులు స్వాగతం పలుకుతుంటూ వాహస సేవల్లో పరి తపిస్తున్న ఆదిదేవుడు భక్తులకు కటాక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. తొమ్మిదిరోజుల పాటూ జరిగే ఈ ఉత్సవాల్లో మలయప్ప స్వామివారు ఉదయం, రాత్రి సమయాల్లో వివిధ వాహనాల్లో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. 14న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంసవాహనంపై స్వామివారు విహరిస్తారు.. 15న ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం.. అలాగే 16న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి భక్తులకు దర్శనమిస్తారు. 17న ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహన సేవ జరుగుతుంది. 18న ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం సర్వర్ణ రథం, రాత్రి గజ వాహన సేవ నిర్వహిస్తారు. 19న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. తొమ్మిదోరోజు ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణతో ఉత్సవాలు పూర్తవుతాయి. .
వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశామని టీటీటీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జేఈఓలు శ్రీనివాసరాజు.. పోలా భాస్కర్‌తో కలిసి సమీక్షించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో రాత్రి వాహనసేవను గంట ముందుగా ప్రారంభిస్తామన్నారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు జరుపుతామన్నారు. గరుడవాహనసేవను రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. రద్దీ దృష్ట్యా ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు. భక్తుల కో సం రోజూ 7 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నామన్నారు. శ్రీవారి ఆలయం,ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో విద్యుత్, పుష్పాలం కరణలు చేపట్టామన్నారు. పోలీసులు కూడా బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 600 సీసీ కెమెరాలతో నిఘా పటిష్టం చేసారు. గరుడ సేవ రోజు రద్దీ అధికంగా ఉంటుంది. దాంతో ఆ రోజు కనుమ రహదారుల్లో వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు.