పోలవరం ప్రాజెక్టు గ్యాలరీవాక్‌కు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, అయన సతీమణి నారా భువనేశ్వరీ కు అఖండ స్వాగతం లభించింది. తొలుత పోలవరం ప్రాజెక్టు నిర్మాణప్రాంతంలోని హెలిప్యాడ్‌కు ఉదయం 10.30 గంటలకు చేరుకున్న ముఖ్యమంత్రి, నారా భువనేశ్వరీ, రాష్ట్ర పంచాయతిరాజ్ శాఖామంత్రి నారా లోకేష్, అయన సతీమణి నారా బ్రాహ్మణిలకు ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), తదితరులు మంగళవాయిద్యాలతో హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం హెలిప్యాడ్ వద్ద ఉన్న హోమశాల వద్ద ముఖ్యమంత్రి హోమ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావాలని వారు ఆకాంక్షించారు. రాష్ట్రానికి జీవనాఢి అయిన పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయంలో పూర్తికావాలని వారు ఆకాంక్షించారు. అనంతరం గ్యాలరీవాక్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు తమ అమూల్యమైన భూములను ప్రభుత్వానికి అప్పగించిన నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ క్రింద ప్రభుత్వం ఆదుకుని వారి కుటుంబానికి అన్నీరకాలుగా సహాయ సహకారములను అందించడం జరుగుతుందని చెప్పారు. ఈసందర్భంగా భూములను ఇచ్చిన రైతులకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రైతాంగానికి ఎ టువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి ప్రభుత్వం అన్నీరకాలుగా సహకరిస్తుందని ఈసందర్భంగా ముఖ్యమంత్రి రైతులకు హామి ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణము పూర్తి చేయడంలో నవయుగ కంపెనీ చాలా వేగంగా పనిచేస్తోందని ఈసంస్ధ అనుకున్నంతమేర పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తున్నదని రికార్డు స్ధాయిలో స్పిల్ వే పనులు, కాంక్రీటు పనులు, ఇతర ప్రాజెక్టు నిర్మాణపనులను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంను వినియోగించి పనిచేస్తున్నదని ఈసందర్భంగా ఇంజినీర్లను ముఖ్యమంత్రి అభినందించారు. జాతీయ ప్రాజెక్టుగా పేరొందిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న అన్నీ ఏజెన్సీలు కూడా నవయుగ ఏజెన్సీమాదిరిగా కష్టపడి పనిచేసిన ఎ డల అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేసి జాతిక అంకితం చేస్తామని ఈసందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. కాంక్రీటు పనులు రికార్డు స్ధాయిలో పూర్తి అవుతున్నాయని చెప్పారు. 10500 కోట్ల రూపాయల సహాయం రైతులకు చేరువు చేసి అనుకున్న సమయానికి పట్టిసీమ ఎ త్తిపోతల పధకాన్ని పూర్తి చేసి అదనపు సేద్యపుభూమిని సాగులోనికి తీసుకురావడం జరిగిందన్నారు. పట్టిసీమ ఎ త్తిపోతల పధకం ద్వారా రెండవ పంటకు సమృద్ధిగా సాగునీరు లభ్యం అవుతున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. గ్యాలరీ వాక్ కోసం స్పిల్ వే ప్రాంతానికి చేరుకుంటున్న ముఖ్యమంత్రి వెంట పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, రైతులు ఉన్నారు. అనంతరం ముఖ్యమంత్రి సభావేదిక వద్దకు చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ముఖ్యమంత్రికి పెద్దఎ త్తున స్వాగతం లభించింది. ఈకార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన 165 మంది శాసనసభ్యులు పాల్గొన్నారు. ఇందులో 17 మంది మహిళా శాసనసభ్యులు ఉన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకరు డా. కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (ఉమ), రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి నక్కా ఆనందబాబు, రాష్ట్ర మంత్రి అచ్ఛెన్నాయుడు, రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యనపాత్రుడు, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మంత్రులు శిద్ధారాఘవరావు, కాలవ శ్రీనివాసులు, కెయస్. జవహర్, రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖా మంత్రి పితాని సత్యనారాయణ, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, యంపిలు సియం. రమేష్, తోట నరసింహం, కొణతాల నారాయణరావు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ , శాసనమండలి ఛైర్మన్ ఫారూఖ్, శాసనమండలి డిప్యూటి ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, యంయల్‌సిలు అంగర రామ్మెహనరావు, యంహెచ్. షరీఫ్, పాందువ్వ సత్యనారాయణరాజు, శాసనసభ్యులు మొడియం శ్రీనివాసరావు, ఆరిమిల్లి రాధాకృష్ణ, వేటుకూరి శివరామరాజు, బూరుగుపల్లి శేషారావు, మాజీ మంత్రి చింతలపూడి శాసనసభ్యురాలు పీతల సుజాత, బండారు మాధవనాయుడు, బిజెపి శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్ధ ఛైర్మన్ పాలి ప్రసాద్, రాష్ట్ర చలనచిత్ర, టివి, నాటక రంగ అభివృద్ధి సంస్ధ ఛైర్మన్ అంబికా కృష్ణ, ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు కాటంనేని భాస్కర్, కార్తికేయ మిశ్రా, ఉభయగోదావరి జిల్లాల యస్‌పిలు పశ్చిమ గోదావరి రవిప్రకాష్, బి. విశాల్, పోలవరం పునరావాసం, సహాయ కమిషనరు రేఖారాణి, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ , ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, పోలవరం ఇరిగేషన్ యస్ఇ వి. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.