వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాదించేలా సహకరించాలని వైసీసీ అధినేత జగన్ కోరారు.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. బుధవారం ఉదయం వైఎస్ జగన్ విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలోని నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి భారీగా డబ్బులు వెదజల్లే ప్రమాదం ఉందని...మన వద్ద అంత డబ్బు లేదన్నారు. చంద్రబాబు ఇచ్చే చిల్లర డబ్బుల కన్నా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అంతకు మించి వంద రెట్ల ప్రయోజనం ఉంటుందని జనం విశ్వసించాలి. అప్పుడే చంద్రబాబు ఇచ్చే డబ్బును కాదని వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తారు. అందుకు నవరత్నాలే మనకు అస్త్రాలు. నవరత్నాలతో ప్రతి కుటుంబానికి ఏడాదికి ఎంత మేలు, లబ్ధి చేకూరుతుందో ప్రజలకు మనం చెప్పాలి. సీపీఎస్ రద్దుకు సహకరించాలని ఆంధ్రవిశ్వవిద్యాలయం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ ప్రతినిధులు జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ఆయనకు వినతిపత్రం అందించిన వారిలో ఏయూ ప్రతినిధులు పి.సాంబమూర్తి, డాక్టర్ జానకీరామ్, ప్రొఫెసర్ కోటిరెడ్డి, డాక్టర్ ప్రేమానంద్, భైరాగిరెడ్డి, పద్మకల్యాణి, ఆదిలక్ష్మి తదితరులు ఉన్నారు. అక్కడి నుంచి ఉషోదయ జంక్షన్, టీటీడీ ఫంక్షన్ హాల్ జంక్షన్, ఎంవీపీ కాలనీ, వెంకోజీపాలెం పెట్రోల్ బంక్ జంక్షన్, హనుమంతవాక జంక్షన్ మీదుగా అరిలోవ జంక్షన్ వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగింది. అక్కడ వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. లంచ్ క్యాంప్ నుంచి చినగాదిలి వరకు జననేత పాదయాత్ర సాగింది. ః