YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ముగిసిన హార్దిక్ పటేల్ దీక్ష

ముగిసిన హార్దిక్ పటేల్  దీక్ష

పటేళ్లకు రిజర్వేషన్లు, రైతుల రుణమాఫీ తదితర డిమాండ్లతో 19 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న పటేల్‌ ఉద్యమ నేత హార్థిక్‌ పటేల్‌ బుధవారం తన ఆందోళన విరమించారు. భవిష్యత్‌ పోరాటాల కోసం బతికిఉండాలని అనుచరులు నచ్చచెప్పడంతో ఆయన దీక్ష విరమించారు. పటిదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి (పీఏఏఎస్‌) నేత హార్థిక్‌ పటేల్‌ ఆగస్ట్‌ 25 నుంచి తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు.పటేళ్లకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం, రైతులకు రుణమాఫీ డిమాండ్లను నెరవేర్చేవరకూ తన ఆందోళన కొనసాగుతుందని హార్థిక్‌ అంతకుముందు ప్రకటించారు. కాగా పటేల్‌ దీక్షకు కాంగ్రెస్‌ సహా విపక్షాల నుంచి మద్దతు లభించింది. ప్రభుత్వం తక్షణమే కోటా సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. దీక్షకు దిగినప్పుడు 78 కిలోల బరువున్న పటేల్‌ ప్రస్తుతం 20 కిలోలు తగ్గారని ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వైద్యులు తెలిపారు.  దీక్షా వేదిక వద్ద ప్రభుత్వ ఆదేశాల మేరకు అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన అంబులెన్స్‌ ‘ఐసీయూ ఆన్‌ వీల్స్‌’ ను సిద్ధంగా ఉంచారు. కాగా తన నివాసాన్ని సందర్శించే ప్రజలను పోలీసులు వేధించడం నిలిపివేసే వరకూ తాను వైద్యులను అనుమతించనని మెడికల్‌ చెకప్‌కు హార్ధిక్‌ పటేల్‌ నిరాకరిస్తున్నారని వైద్యులు తెలిపారు.పటేళ్లకు కోటాతో పాటు రైతు రుణాల మాఫీ వంటి పలు డిమాండ్లను పటేల్‌ ముందుకు తెచ్చారు.గత నెల 25న హార్థిక్‌ పటేల్‌ నిరవధిక నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. మరోవైపు నిరవధిక దీక్ష చేపట్టిన హార్ధిక్‌ పటేల్‌ను పరామర్శించేందుకు బీజేపీ ఎంపీ శత్రుజ్ఞ సిన్హా రానున్నారు. మోదీ సర్కార్‌పై పలు సందర్భాల్లో సిన్హా నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే.

Related Posts