YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ విరాట్ కోహ్లీ నెం.1

 ఐసీసీ  ర్యాంకింగ్స్‌లోనూ విరాట్ కోహ్లీ నెం.1

ఇంగ్లాండ్‌ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌ని భారత్ జట్టు 1- 4 చేజార్చుకున్నా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మాత్రం నెం.1 స్థానాన్ని నిలబెట్టుకుంది. ఓవల్ వేదికగా మంగళవారం ముగిసిన ఆఖరి టెస్టులో 464 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు 345 పరుగులకే ఆలౌటై పరాజయంతో ఇంగ్లాండ్ పర్యటనని ముగించిన విషయం తెలిసిందే. సిరీస్ ప్రారంభానికి ముందు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 125 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ ఖాతాలో బుధవారం 10 పాయింట్లు కోత పడినా.. నెం.1 స్థానాన్ని నిలబెట్టుకోగలిగింది. భారత్ తర్వాత దక్షిణాఫ్రికా (106), ఆస్ట్రేలియా (106), ఇంగ్లాండ్ (106), న్యూజిలాండ్ (102) జట్లు టాప్-5లో నిలిచాయి. ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లోనూ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నెం.1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సిరీస్‌లో అత్యధికంగా 593 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 930 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగగా.. అతని తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ (929), న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (847), ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ (835), ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (820) టాప్-5లో కొనసాగుతున్నారు. ఇక ఓవల్ టెస్టుతో కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడిన ఇంగ్లాండ్ వెటరన్ ఓపెనర్ అలిస్టర్ కుక్.. రెండు ఇన్నింగ్స్‌లో 71, 147 పరుగులు చేసి 709 పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు. 

Related Posts