ఈ నెల 16 న వీఆర్వో పరీక్ష జరగనున్నదని టీఎస్పీఎస్సి సెక్రటరీ వాణీ ప్రసాద్ వెల్లడించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా 7 లక్షల కన్నా ఎక్కువ దరఖాస్తులు రాలేదు. కానీ ఈ పరీక్షకు 11 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 31 జిల్లాలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసాం. 2వేల945 సెంటర్స్ లలో పరీక్ష వుంటుంది. ఈ రోజు వరకు 7 లక్షల మంది హల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. కొన్ని జిల్లాలో సెంటర్ లు సరిపోక కొద్దిమంది ని వారూ కోరుకున్న సెంటర్ కాకుండా వేరే ప్రాంతాల్లో కేటాయించడం జరిగిందని ఆమె అన్నారు. ఇబ్బందులు రాకుండ హాల్ టికెట్లు వెంటనే డౌన్ లోడ్ చేసుకుంటే బాగుంటుంది. 11 గంటల నుండి 1.30 వరకు పరీక్ష వుంటుంది. ఐడీ ప్రూఫ్, హాల్ టికెట్ తప్పని సరని ఆమె అన్నారు. వివరాలను సరిగా నమోదు చేసుకొని రెండు వేల మంది అభ్యర్థులకు ఎడిట్ చేసుకోవాలని మెస్సేజ్ పెట్టాం. బయో మెట్రిక్ అటెండెన్స్ లేదు. హెచ్ఎండీయే పరిధి లో 3 లక్షల మంది పరీక్ష రాస్తున్నారని ఆమె అన్నారు.