YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సంసిద్దత పై అంచనా: ఉమేష్ సిన్హా

సంసిద్దత పై అంచనా: ఉమేష్ సిన్హా

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, పోలీస్ అధికారులు, కలెక్టర్ల తో మీటింగ్ జరిగింది. వారి సంసిద్ధత మీద అంచనా వేసాం. జిల్లా అధికారులు తరువాత సీఎస్ తో మీటింగ్ అయింది. అన్నింటి మీద ఒక నివేదిక ఇస్తాం. రాజకీయ పార్టీ ల తో కూడా  చర్చ జరిపామని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఉమేష్ సిన్హా అన్నారు. ఆరు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ఓటర్ల జాబితాపై చర్చించారు. సమస్యాత్మక ప్రాంతాలు, శాంతిభద్రతలు, ఈవీఎంల రవాణాపై చర్చించారు. ఓటర్లను ప్రలోభపెట్టే అంశాలపై దృష్టి పెట్టాలని అధికారులకు ఈసీ సూచించింది. ఉమేష్ మాట్లాడుతూ  క్షేత్ర స్థాయిలో తిరగాలి అని రాజకీయ పార్టీలు కోరాయి. ఒక్క ఓటర్ కూడా మిస్ అవ్వకూడదని, తొలగించిన పేర్ల మీద విచారణ జరపాలని అన్నారు. ఓటర్ నమోదు మీద అనేక రూపాల్లో ప్రచారం చెయ్యాలని పార్టీ లు కోరాయి. ఇచ్చిన నమోదుకు 15 రోజుల తరువాత  సమీక్ష చేస్తామని అయన అన్నారు. రాజకీయ పార్టీలు చెప్పిన సమస్యలు నోట్ చేసుకున్నాం. జిల్లా ఎన్నికల అధికారులు ప్రతీ సమస్య మీద 24 గంటల లోపు స్పందించాలి. ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఓటర్ నమోదు ప్రచారం చేయాలని కోరాం. బీఎల్వో స్థాయి, ఆ పైన అధికారులు కూడా క్షేత్ర స్థాయి లో తిరగాలని సూచించాం. శాంతి , భద్రతలు విషయం, వివి ప్యాట్, బ్యాలెట్ ల విషయం లో కూడా  సమీక్ష చేసామని అయన అన్నారు. జిల్లా అధికారులు,  రాజకీయ పార్టీల   సమీక్ష చేసిన దాని మీద నివేదిక ఇస్తామని అన్నారు. ఏడు మండలాల మీద  కూడా పార్టీలు ఆడిగాయి. మేము  కేవలం ఇక్కడ సంసిద్ధత మీద అంచనా వేయడానికి మాత్రమే వచ్చాం. ఢిల్లీ వెళ్లిన వెంటనే  నివేదిక ఇస్తాం. ఎలాక్టోరల్ రోల్, శాంతి భద్రతల మీద జిల్లా అధికారులు చెప్పారని అయన అన్నారు. పండగల సమయం ఉన్నది కాబట్టి ఓటరు నమోదు  సమయం పెంచాలన్నారు. అన్ని విషయాలపై నివేదికలు ఇస్తామని అయన అన్నారు. 

Related Posts