మన శాస్త్ర, పురాణములలో మన పూర్వికులు, ఋషులు, మునులు చెప్పిన కధలు, సంఘటనలు మనస్సుకు హత్తుకునే విధంగా, ఆలోచింప చేసే విధంగా ఉంటాయి. వారు చెప్పిన ప్రతి విషయం లో ఎంతో ఖటినమైన, జటిలమైన విషయాన్ని క్రోడీకరించి చిన్న కధగా చెప్తారు, మనం అలోచించి తెలుసుకో గలిగితే, మన జన్మ ధన్యం అవుతుంది. ఇటువంటి ఒక అధ్బుతమైన విషయాన్ని వినాయక ఆవిర్భావం లో కూడా చెప్పారు.
పార్వతీదేవి శక్తి స్వరూపిణి.
ఆమె నలుగుపెట్టుకున్న తరువాత వచ్చిన నలుగు పిండితో ఆమె ఒక రూపాన్ని చేసింది. అంటే ఆమె శరీరంలోనుండి వచ్చిన మలినములు (కేవలం శక్తి వల్ల వచ్చే అతిశయం) ఒక రూపాన్ని తీసుకున్నది.
అతనికి వినాయకుడు అని పేరు పెట్టారు. - నాయకుడు : తండ్రి , వినా: సంభందం లేని వాడు (తండ్రితో నిమిత్తం లేకుండా జన్మించిన వాడు) అంటే శివుని నిమిత్తం లేకుండా జన్మించినవాడు.
మహాదేవుడు తిరిగి వచ్చినపుడు ఆ బాలుడు శివుని గుర్తించలేదు. - అంటే కేవలం అతిశయించిన శక్తి సామర్ద్యములు ఉండుటవల్ల రజోగుణం ప్రజ్వరిల్లి, జ్ఞానమును లోనికి రానివ్వకుండా అడ్డుకుంటారు.
శివుడు ఆ బాలుని శిరస్సు ఖండించి లోనికి ప్రవేశించారు - అంటే రజోగుణ అతిశయమును ఖండించి జ్ఞానము లోనికి ప్రవేశించినది.
ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి తల్లి తన పుత్రునిలో లోపములను, దోషములను కూడా ప్రేమించగలదు, కానీ తండ్రి అతని పుత్రుల లోని అజ్ఞానాన్ని చూసి ఊరుకోలేడు, ఊరుకోకూడదు కూడా. అది అతని ధర్మం. కనుకనే పుత్రుని దండించవలసిన అవసరం ఆదిపిత అయిన శివుని భాద్యత.
ఉత్తరం వైపునకు తల పెట్టి పడుకున్న జీవి తల - మనకు శాస్త్రముల ప్రకారం, చనిపోయిన లేదా తాము మరణమును ఆహ్వానిస్తున్నాము అనే వారు తప్ప ఎవరూ ఉత్తర దిశకు తలపెట్టి పడుకోరు. కాబట్టి తామంత తాము శిరస్సు ఇవ్వటానికి సిధమైన వారి నుండి శిరస్సుని తీసుకురమ్మని ఆజ్ఞ.
ఏనుగు తల - ఏనుగు తల మనకు జ్ఞాన శక్తి, క్రియాశక్తి (కర్మశక్తి) కి ప్రతీక,
ఆ తలను బాలుని శరీరమునకు అతికించే పని స్వయంగా శివుడు చేసాడు కనుక ఇప్పుడు వినాయకుని జననం లో శివునికి కూడా భాగం కలిగినది. అంటే శక్తితో పాటు జ్ఞానం కూడా వినాయకునికి ప్రాప్తించినది.
ఇప్పుడూ అతనిని వినాయకుడు అనే పిలిచారు. *వినాయకుడు విచిత్రమైన నాయకుడు*