YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు

ఆరంభ వేడుక సజావుగా సాగేనా..?

 ఆరంభ వేడుక సజావుగా సాగేనా..?

- ఉష్ణోగ్రతలు -20 డిగ్రీలకు పడిపోయిన నేపథ్యంలో 

- వింటర్‌ ఒలింపిక్స్‌

ప్యాంగ్‌చాంగ్‌: ఈ శుక్రవారం ఆరంభమయ్యే వింటర్‌ ఒలింపిక్స్‌కు అంతా సిద్ధమైంది. కానీ ఎముకలు కొరికే చలే నిర్వాహకులను భయపెడుతోంది. ఉష్ణోగ్రతలు -20 డిగ్రీలకు పడిపోయిన నేపథ్యంలో ఆరంభ వేడుక సజావుగా సాగుతుందో లేదో అన్న కంగారు మొదలైంది. చలికి భయపడి కొంత మంది అథ్లెట్లు ఆరంభోత్సవానికి దూరమయ్యే అవకాశముంది. ఈ చలి దుష్పరిణామాలకు భయపడుతున్న ఇటలీ.. వేడుక సందర్భంగా నిరంతరం సంచరిస్తునే ఉండాలని తన అథ్లెట్లకు సూచించింది. గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం ఉన్న కోచ్‌లు, సిబ్బంది వెచ్చని ప్రదేశంలో ఉండాలని ఇటలీ జట్టు వైద్యులు ఆదేశించారు. పైకప్పు లేని స్టేడియంలో శుక్రవారం రాత్రి ఆరంభ కార్యక్రమం జరగనుంది. తమ జట్టులోని కొంత మంది అథ్లెట్లు మార్చ్‌పాస్ట్‌కు దూరంగా ఉండే అవకాశముందని న్యూజిలాండ్‌ జట్టు షెఫ్‌ ద మిషన్‌ పీఠర్‌ వార్దెల్‌ చెప్పాడు. సాధారణంగా వింటర్‌ ఒలింపిక్స్‌లో పోటీపడే అథ్లెట్లు తీవ్రమైన చలికి అలవాటు పడే ఉంటారు. కానీ గాలులు కూడా వీస్తుండడంతో చలి మరీ భయంకరంగా ఉందని కొందరు అథ్లెట్లు అంటున్నారు.

ఒలింపిక్‌ స్ఫూర్తిని నిలబెట్టారు: బద్ధ శత్రువులైనప్పటికీ వింటర్‌ ఒలింపిక్స్‌ కోసం చేతులు కలిపిన దక్షిణ కొరియా, ఉత్తర కొరియాలను అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం (ఐఓసీ) అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ ప్రశంసించాడు. ఆరంభం కార్యక్రమం సందర్భంగా రెండు దేశాలు ఒకే పతాకం కింద మార్చ్‌పాస్ట్‌ చేయడం.. ప్రపంచానికి శక్తివంతమైన శాంతి సందేశాన్ని పంపించబోతోందని అన్నాడు. ‘‘అపనమ్మకం, వైరం వేరు చేసిన రెండు దేశాలను ఒలింపిక్‌ స్ఫూర్తి ఒక్క దగ్గరికి చేర్చింది. కొరియా ద్వీపకల్పంలోని ప్రతి ఒక్కరిలో ఉజ్వల భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించింది’’ అని బాచ్‌ చెప్పాడు.

Related Posts