2010 లో రైతులకు అన్యాయం జరుగుతుందని పక్క రాష్ట్రంపై పోరాటం చేసిన యోధుడు చంద్రబాబ. మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుపై ఎంతో కఠినంగా వ్యవహరించిన వెనక్కి తగ్గలేదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు శుక్రవారం అయన చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నాన్బెయిల్బుల్ వారెంట్ జారీ చేయడం కుట్రలో భాగమే. కేంద్రంలో ఉన్న మోడీ, జగన్, తెలంగాణా సీఎం కలిసి చంద్రబాబును ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారు. ఐక్యరాజ్యకమిటీలో ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగించే అవకాశం చంద్రబాబుకు రావటంపై తట్టుకోలేకపోతున్నారని అన్నారు. నాన్ బెయిల్బుల్ కేసు గరుడ ఆపరేషన్లో భాగమే. చట్ట విరుద్ధంగా నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ చేయడం చరిత్రలో లేదు. దేశానికి ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్ అయింది. కుట్రలను ఛేదించే శక్తి చంద్రబాబుకు ఉంది. మోడీని విమర్శించే వారిపై కేంద్రం ఈడీ, పోలీసులు, కేసులులను బనాయిస్తున్నారని అయన ఆరోపించారు.