ఏర్పేడు ఎస్ఐ వెంకటరమణ గుండె పోటుతో మృతి చెందాడు. సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన అనంతరం తిరుగు ప్రయాణంలో రేణిగుంట వద్ద బందోబస్త్ లో ఉన్న సమయంలో వెంకట రమణకు గుండెపోటు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటరమణ మృతి చెం దాడు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి పర్యటనలో బందోబస్తు నిమిత్తం రేణిగుంట ఏయిర్ పోర్ట్ లో భద్రత పర్యవేక్షిస్తున్న ఏర్పేడు ఎసై వెంకటరమణకు గుండెపోటుకు గురైయ్యారు. శుక్రవారం ఉదయం అయనను హుటాహుటిన తిరుపతిలోని నారాయణాద్రి ఆసుపత్రికి తరలించారు. 38 సంవత్సరాల గల ఎస్సై వెంకటరమణ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. కడప జిల్లా రాయచోటి మండలం వొంగిమల్ల గ్రామానికి చెందిన వెంకటరమణ గతంలో తిరుమలలో పనిచేసారు. అప్పటివరకు హుషారుగా ఉన్న తోటి అధికారి అలా కంటి ముందే కుప్పకూలి తుదిశ్వాస విడవటం జీర్ణించుకో లేకపోతున్నారు సహచర పోలీసులు. వెంకటరమణ అందిరితో కలుపుగోలుగా స్నేహితుడుగా ఉండేవారని తోటి పోలీసులు కొనియాడారు. ఎస్ఐ వెంకటరమణ మృతికి సీఎం చంద్రబాబు నాయుడు తన ప్రగాడ సంతాపాన్ని తెలిపారు. వెంకటరమణ కుటుంబ సభ్యులకు తక్షణం సహాయం కింద 10 లక్షలు పరిహారం ముఖ్యమంత్రి ప్రకటించారు. వెంకటరమణ కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలు చెప్పాల్చిందిగా చిత్తూరు జిల్లా మంత్రి అమర్నాథ్రెడ్డి, కలెక్టర్ ప్రద్యుమ్న ను ఆదేశించారు.