YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మూడు గంటల పాటు రాహుల్ చర్చలు ఎన్నికల కోసం ముగ్గురు సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ

మూడు గంటల పాటు రాహుల్ చర్చలు ఎన్నికల కోసం ముగ్గురు సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ

'ముందస్తు నగారా'లో తెలంగాణ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. పొత్తుల ఎత్తులు, అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన ముఖ్య నేతలు.. పార్టీ అధినేత రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటల పాటూ జరిగిన ఈ భేటీలో ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. అలాగే ఎన్నికల కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ సీనియర్ నేత భక్తచరణ్‌దాస్ ఛైర్మన్‌గా జ్యోతిమణి సెంథిమలై, శర్మిష్ట ముఖర్జీతో కమిటీని నియమించారు. వీరు సీట్ల సర్థుబాటు, అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టనుంది. ఈ కమిటీలో ఉన్న శర్మిష్ట ముఖర్జీ.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె. ఎన్నికలపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు రాహుల్ గాంధీ. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉందని.. పార్టీ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారట. నేతలకు అభిప్రాయ బేధాలుంటే పార్టీ వేదికగా కూర్చొని చర్చించుకోవాలని.. గెలుపు గుర్రాలనే బరిలోకి దించుదామని చెప్పా రట. అలాగే పొత్తులు, సీట్ల సర్ధుబాట్ల అంశంపై కూడా చర్చించిన రాహుల్.. పొత్తు, అభ్యర్థుల ఎంపికపై ఎవరూ బాహాటంగా మాట్లాడొద్దన్నారట. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీదే విజయమన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. పొత్తులు, అభ్యర్థుల ఎంపికపై అధినేత రాహుల్‌ దిశానిర్దేశం చేశారని.. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. పొత్తుల గురించి నేతలెవరూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని రాహుల్‌ సూచించారని.. రాష్ట్రంలోని పొత్తులపై తుది నిర్ణయం మాత్రం అధిష్ఠానానిదేనమన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌ను గద్దె దించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని.. అందుకే పొత్తులకు వెళుతున్నట్లు చెప్పారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ రాహుల్‌తో 15 నిమిషాల పాటూ ప్రత్యేకంగా సమావేశమయ్యారట. ఎన్నికల వ్యూహాలపై పార్టీ అధ్యక్షుడితో చర్చించారట. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత పెరిగిందని రాహుల్‌కు వివరించినట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ కోసం పనిచేసిన నేతలు, యువతకు టిక్కెట్లు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈ భేటీ ముగిశాక మాట్లాడిన కోమటిరెడ్డి బ్రదర్స్.. కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పనిచేయాలని అధినేత సూచించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ఆవశ్యకతను ప్రజలకు తీసుకెళ్లాలని దిశా నిర్దేశం చేశారన్నారు.

Related Posts