ఆసియా కప్. 34 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ టోర్నీ.. ఆసియా మహా జట్లు భారత్, పాకిస్థాన్, శ్రీలంకలకు ఎప్పుడూ ప్రతిష్టాత్మకమే. ఈ మూడు జట్ల మధ్య ఎన్నో అద్భుత పోరాటాలు చూశారు అభిమానులు ఈ టోర్నీలో. గత కొన్ని పర్యాయాల నుంచి బంగ్లాదేశ్ సైతం ఈ జట్లతో దీటుగా పోరాడుతోంది. మరోవైపు ప్రారంభ మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. టోర్నీలో కొత్త గా ఈసారి హాంకాంగ్ జట్టు అర్హత సాధించింది. ఇక భారత జట్టు విషయానికి వస్తే అవిశ్రాంతంగా క్రికెట్ ఆడుతున్న కెప్టెన్ కోహ్లీకి విశ్రాంతి కల్పించా రు. 18న హాంకాంగ్ జట్టుతో జరిగే మ్యాచ్‌తో భారత్ ఈ టోర్నీని ఆరంభిస్తుంది. ఆ మర్నాడే పాక్‌తో హైవోల్టేజి మ్యాచ్‌కు సిద్ధం కావాలి. రోహిత్ శర్మకు కెప్టెన్‌గా ఈ టోర్నీ సవాల్‌గా మారవచ్చు. ఇప్పటిదాకా అతను శ్రీలంకతో వన్డే, టీ20 సిరీ్‌సలకు, అక్కడే జరిగిన నిదహాస్ ట్రోఫీలో నాయకత్వం వహించాడు.