విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు ఆలూరి బుచ్చయ్య చౌదరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతం కోసం బుచ్చయ్య చౌదరి పోరాడారని కొనియాడారు. ఆయన ఆశయాలను వారి కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఈ రోజు ఒక మంచి కార్యక్రమంలో మనం పాల్గొని గొప్ప వ్యక్తి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్నాం. లక్ష మంది కి పైగా విద్యార్థులు విద్యా దానం చేసిన గొప్ప వ్యక్తి. రానురాను విద్యకు ప్రాముఖ్యత పెరిగిపోయింది. నాలెడ్జ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చి దిద్దుతున్నాము. కాటన్ మహాసేయుని ఆలోచన తో బ్యారెజ్ కట్టడం వల్లనే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఎంత అభివృద్ధి చెందిన విషయం చూస్తున్నామని అన్నారు. విజయవాడ నగరానికి పరిశుభ్ర నగరంగా 2వ స్థానం, నివాస యోగ్యం నగరంగా 9వ స్థానము వొచ్చింది. బుచ్చయ్య చౌదరి మాస్టర్ ప్రారంభించిన కార్యక్రమాలు భవిష్యత్తు కోసం కొనసాగించాలని అన్నారు.