వాహనంపై పార్టీ జెండా, మోదీ ఫొటో..
ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్‌భాయ్ మోదీ బుధవారం శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చారు. రాత్రి 7 గంటలకు గోవిందసాయి అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు టీటీడీ రిసెప్షన్ అధికారులు స్వాగతం పలికి బస, దర్శన ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌లో ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆయన తిరుమలకు వచ్చిన వాహనంపై బీజేపీ జెండా ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుమలలో రాజకీయ పార్టీల జెండాలు, ప్రచారాలు, నినాదాలు నిషేధం.