సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఐఎమ్ఏ హాల్లో ఈఎన్టీ వైద్యుల 4వ రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్ను వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మందా జగన్నాథం, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ మూడు రోజులుగా సిద్దిపేటలో ఈఎన్టీ పరిశోధన పరికరాల ప్రదర్శించడం సంతోషకరమని అన్నారు. ఉద్యమగడ్డ సిద్దిపేటలో డాక్టర్ల సమావేశం ఆనందంగా ఉంది. కోటి ఈఎన్టీ ఆసుపత్రిలో మోడులర్ థియేటర్ కూడా ఏర్పాటు చేసాం. అక్కడ వారానికి మూడు రోజులు చికిత్స జరుపుతున్నారు. గతానికి ఇప్పడికి వైద్యశాఖ లో మెరుగు పడింది. జిల్లా ఆసుపత్రిలో ఎమర్జెన్సీ సేవలు లేక ఇబ్బందులు ఉండేవి. ఇప్పడు ప్రతి జిల్లా ఆసుపత్రిలో ఎమర్జెన్సీ సేవలు మెరుగుపడ్డాయని అయన అన్నారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని మెరుగైన సేవలు అందుతున్నాయి. సిద్దిపేటలో డయాలసిస్ యూనిట్ ను ఏర్పాటు చేసాం. ప్రజలకు రోగాన్ని నిరోధించే విధంగా కృషి చేస్తున్నాం. అందరికి వైద్యం చేసే బదులుగా అందరికి రోగాలు రాకుండా చూస్తున్నామని మంత్రి అన్నారు.