ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ ఘనంగా బోణీ కొట్టింది. టోర్నీలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన శ్రీలంకను ఆరంభ మ్యాచ్‌లో ఆ జట్టు 137 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మొదట లసిత్ మలింగ (4/23) ధాటికి ఆరంభంలో బెంబేలెత్తిన బంగ్లా.. రహీమ్, మిథున్ల పోరాటంతో పుంజుకుని 49.3 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లంక 35.2 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. 29 పరుగులు చేసిన దిల్రువాన్ పెరీరానే టాప్‌స్కోరర్. మొర్తజా (2/25), ముస్తాఫిజుర్ (2/20), మెహదీ హసన్ (2/21) ప్రత్యర్థిని దెబ్బ తీశారు.