తిరుమల గిరుల్లో కొలువైన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తిరుమల శ్రీవారి సేవలన్నింటిలో గరుడసేవకు అత్యంత ప్రాశస్త్యం ఉందన్న సంగతి తెలిసిందే. లక్షలాది మంది భక్తులు గరుత్మంతుడిపై వచ్చే స్వామిని తిలకించేందుకు తిరుమలకు క్యూ కడతారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, నేటి రాత్రి నుంచి తిరుమలకు ద్విచక్ర వాహనాలను అనుమతించబోమని, గరుడసేవ ముగిసి, కొండపై రద్దీ తగ్గిన తరువాతనే బైకులను అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. అసంఖ్యాకంగా తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయనున్నామని, నేడు, రేపు రాత్రంతా బస్సులను నడిపిస్తామని తెలిపారు.